Raashi Khanna: అమ్మకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన రాశీఖన్నా.. మదర్స్ డే స్పెషల్‌

Published : May 08, 2022, 08:04 PM IST
Raashi Khanna: అమ్మకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన రాశీఖన్నా.. మదర్స్ డే స్పెషల్‌

సారాంశం

రాశీఖన్నా మదర్స్ డే సందర్భంగా తన అమ్మని భారీగా సర్‌ప్రైజ్‌ చేసింది. పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచింది. 

స్టార్‌ హీరోయిన్‌ రాశీఖన్నా(Raashi Khann) మదర్స్ డే(Mothers Day) సందర్భంగా తన అమ్మని భారీగా సర్‌ప్రైజ్‌ చేసింది. పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచింది. ఏకంగా లగ్జరీ కారుని కొనిచ్చి షాక్‌కి గురి చేసింది. మదర్స్ డే సందర్భంగా రాశీఖన్నా తన అమ్మకి బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. తాజాగా ఆయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అమ్మ అంటేనే సృష్టికి మూలం. అమ్మ లేనిదే సృష్టి లేదు. అలాంటి అమ్మకి, మనకు జన్మనిచ్చిన అమ్మకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ ఇలాంటి గిఫ్ట్ లు ఆమెని సంతోషపరుస్తాయని చెప్పొచ్చు. 

అలానే తన దైన స్టయిల్‌లో తన అమ్మని సర్‌ప్రైజ్‌ చేసింది రాశీఖన్నా(Raashii Khanna). కోటీ నలభై లక్షల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కారుని బాహుమతిగా ఇచ్చిన షాకిచ్చింది. వరుస సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ రాశీఖన్నా ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మతోనే గడిపింది. అమ్మతో సముద్రపు లొకేషన్‌లో దిగిన ఫోటోని పంచుకుంటూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం అమ్మకి కారు గిఫ్ట్ ఇచ్చింది. షోరూమ్‌లో బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేస్తున్నప్పుడు దిగిన ఫోటోలు, వాళ్ల అమ్మ కారులో కూర్చొని  ఉన్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రాఖీఖన్నా ఫాదర్‌ కూడా ఉన్నారు. 

రాశీఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ ని పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ ని జరుపుకుంటోంది. మరోవైపు గోపీచంద్‌తో కలిసి `పక్కా కమర్షియల్‌ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో నాలుగు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తుంది. దీంతోపాటు `ఫర్జీ` అనే హిందీ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తుంది రాశీఖన్నా. మరోవైపు ప్రభాస్‌-మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ రాశీఖన్నా పేరు వినిపిస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే