
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక రిలీజ్ అవ్వడమే తరువాయి. బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈసినిమా సెన్సార్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా...రిలీజ్ కు ముస్తాబు అయ్యింది. తాజా సర్కారువారి పాట మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇక సర్కారువారి పాట సినిమా డ్యూరేషన్ 162 నిమిషాల 25 సెకన్లు వచ్చినట్టు..మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు ఓ పోస్ట్ ను పెట్టారు. ఇక ఈసినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అవ్వడంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ తో.. ఈ సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సర్కారు వారి పాట మూవీ ఈ నెల 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇక ఈమూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్, 14 రీల్స్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్.
ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఇక నుంచి సూపర్ స్టార్ కూడా వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.