
ఎలక్షన్స్ హంగామా ముగియడంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ సందడి తగ్గుతుందేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పట్లో ఆ డోస్ తగ్గేలా లేదని మరో వీడియో నిరూపిస్తోంది. కెఏ.పాల్ ఓటేసి రాగానే ఎగిరి గంతేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే దానిపై ఓ లుక్కేసిన దర్శకుడు వర్మ ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్స్ కి చూపిస్తూ ఊహించని క్యాప్షన్ ఇచ్చాడు. "గొలుసేసి కట్టేయకపోతే కరుస్తాడేమో" అన్నట్లు పాల్ కి సంబందించిన వీడియో కి వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ లో మరింత వైరల్ అయ్యింది.