పవన్ కళ్యాణ్ పాత్రలో అలీ.. ఎందుకిలా?

By Prashanth MFirst Published Apr 14, 2019, 2:58 PM IST
Highlights

అలీ, పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. అయితే ఎలక్షన్స్ వీరిద్దరి మధ్యా దూరం పెంచింది.  అలీ వైసిపిలో చేరడాన్ని పవన్‌ తప్పుబట్టారు. అది అలీకి అస్సలు నచ్చలేదు. తనకి సాయం చేసినా గుర్తుంచుకోలేదు అని పవన్‌ అన్న మాటలతో నొచ్చుకుని వీడియో రిలీజ్ చేసారు. 

అలీ, పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. అయితే ఎలక్షన్స్ వీరిద్దరి మధ్యా దూరం పెంచింది.  అలీ వైసిపిలో చేరడాన్ని పవన్‌ తప్పుబట్టారు. అది అలీకి అస్సలు నచ్చలేదు. తనకి సాయం చేసినా గుర్తుంచుకోలేదు అని పవన్‌ అన్న మాటలతో నొచ్చుకుని వీడియో రిలీజ్ చేసారు.  అలాగే తాను పవన్‌ని  పల్లెత్తు మాట అనలేదని ఆలీ అన్నారు. సర్లే అదీ రాజకీయం...నిజంగానే   పబ్లిక్‌ మీటింగ్స్‌లో, ఎలక్షన్‌ ర్యాలీల్లో ఆలీ ఏమీ అనలేదు. 

కానీ పవన్‌ని కిండల్‌ చేస్తూ పోసాని కృష్ణమురళి తీసిన 'ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు' సినిమాలో ఆలీ 'పవన్‌కళ్యాణ్‌'గా నటించాడని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి సపోర్ట్‌ ఇచ్చిన నేపథ్యాన్ని వాడుకుంటూ రాసిన ఈ క్యారెక్టర్‌లో ఆలీ ఎందుకు నటించిటం ఇప్పుడు చాలా మందికి షాకింగ్ గా ఉంది.

పోసాని మాట్లాడుతూ ''హైదరాబాద్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ సినిమా చేశాం. టైటిల్‌ ఏంటన్నది సినిమా పూర్తయ్యే వరకు నిర్మాతలకు కూడా తెలియదు. అలాంటిది 'ఫలానా టైటిల్‌తో పోసాని ఓ సినిమా తీశారు. అది చంద్రబాబునాయుడుని అన్‌పాపులర్‌ చేసేలా ఉంది' అని ఎవరో ఓ వ్యక్తి ఏపీ ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అతను ఫిర్యాదులో పేర్కొన్న టైటిల్‌కి, మా టైటిల్‌కి చాలా తేడా ఉంది. 'ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు' అన్నది చాలా పాజిటివ్‌ టైటిల్‌. 

ఇందులో చంద్రబాబును విమర్శించడానికి నేను ఈ సినిమా చేయలేదు. 'మేనిఫెస్టో' అంశాలపై మాత్రమే చర్చించాం. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన కథ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ప్రజాస్వామ్యం, ప్రజల క్షేమం గురించి తీశాం. కులం, డబ్బు, మందుని చూసి కాకుండా నిజాయతీగా సేవ చేసేవాడికి ఓటెయ్యండి అని చెబుతున్నాం. ఇందులో 2రీళ్లు రాజకీయాలుంటే, మిగిలిన 12 రీళ్లు వినోదం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ప్రేమికుడి మోసం... ఇలాంటి అంశాలని చూపించాం' అని తెలిపారు.

click me!