‘పుష్ప’లో పోలీసులను అలా చూపించడం బాధాకరం.. రిటైర్డ్ ఐజీ షాకింగ్ కామెంట్స్..

By Asianet News  |  First Published Apr 20, 2023, 4:01 PM IST

‘పుష్ప’ మూవీ మేకర్స్, నిర్మాతల ఇళ్ల  రెండోరోజు కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ వేళ తిరుపతికి చెందిన రిటైర్డ్ ఐజీ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్ట్ 2తోనైనా పోలీసులను బాగా చూపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 


  

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2021లో ప్రేక్షకుల  ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ (Pushpa The Rise). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కథ, పాటలు, యాక్షన్ పరంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. పుష్ప రాజ్ మ్యానరిజం దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దీనికి  సీక్వెల్ గా ప్రస్తుతం Pushpa 2 The Rule తెరకెక్కుతోంది.

Latest Videos

శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుపతికి చెందిన రిటైర్డ్ ఐజీ కాంతారావు ‘పుష్ప’ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పుష్ప : ది రైజ్ లో స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించారు. పోలీసులను మాత్రం లంచగొండిలుగా చూపించడం బాధాకరంగా ఉంది. పుష్ప కోసం సుకుమార్ టీమ్ మా వద్దకు వచ్చినప్పుడు పలు అంశాలను తెలియజేశాం.  కానీ వారు ఇలా చూపించారు. స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు కుటుంబాలను వదిలి అడవుల్లో విధులు నిర్వహించిన పోలీసులను రెండో పార్ట్ లోనైనా సక్రమంగా చూపించాలని కోరుతున్నాం. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ లో రాజకీయ నాయకుల ప్రమేయం ఊహానిజతం మాత్రమేనన్నారు. తను విధులు నిర్వహించిన సమయంలో ఏ ఒక్కరూ ఫోన్ చేయలేదన్నారు. దీంతో రిటైర్డ్ ఐజీ కామెంట్స్ వైరల్ గా మారాయి. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీస్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.350 కోట్లకు పైగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లు  పూర్తయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, #Where is Pushpa అనే వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సినిమాపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయిక. సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!