‘ఆదిపురుష్’అప్టేడెట్ VFX టీజర్..చూసారా?ఇదిగో

Published : Apr 20, 2023, 03:52 PM IST
 ‘ఆదిపురుష్’అప్టేడెట్ VFX టీజర్..చూసారా?ఇదిగో

సారాంశం

ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తాజాగా టీజర్ బయిటకు వచ్చింది. అప్జేటెడ్ టీజర్ గా ట్యాగ్ చేసి వైరల్ చేస్తున్నారు. 


ప్రభాస్ హీరోగా నటిస్తున్న మొదటి పౌరాణిక చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు  ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 16న థియేటర్లలోకి రానుంది. అయితే అంతకంటే ముందే, అంటే జూన్ 13నే ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తాజాగా టీజర్ బయిటకు వచ్చింది. అప్జేటెడ్ టీజర్ గా ట్యాగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ టీజర్ కు గతంలో వచ్చి విమర్శల పాలైన టీజర్ కు షాట్స్ పరంగా మార్పులు లేవు కానీ కలర్ గ్రేడింగ్, కరెక్షన్స్ చేసి వదిలారు. ఈ టీజర్ ని గతంలో వచ్చిన టీజర్ ని దగ్గర పెట్టుకుని చూస్తున్నారు. 

కొందరైతే ఇందులో కొత్తేమీ ఉందని పెదవి విరుస్తున్నారు. మరికొందరు అభిమానులుకు అయితే  టీజర్‌ తెగ నచ్చేసింది. థాంక్యూ ఓం రౌత్‌ టీజర్‌ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తన్హాజీ ఫేం ఓంరౌత్‌ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్‌ నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.
 
ఈ సినిమా  మూడు రోజుల ముందే ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ కానుంది. దాంతో ఆ ప్రీమియర్‌ షోకు క్రిటిక్స్‌తో సహా పలువురు ఆడియెన్స్‌ సినిమా చూసే అవకాశం ఉంది. దాంతో మూడు రోజుల ముందే ఆదిపురుష్‌ టాక్ బయిటకు వచ్చేస్తుంది. పాజిటీవ్‌ టాక్‌ వస్తే  సూపర్  కానీ, ఏ మాత్రం నెగెటీవ్ టాక్‌ వచ్చినా  యాంటి ఫ్యాన్స్ మోసేస్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుందని కంగారు పడుతున్నారు.  

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. ఓం రౌత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను టిప్స్ సంస్థ నిర్మించింది. ఇండియన్ భాషలతో పాటు.. పలు అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది ఆదిపురుష్ సినిమా.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం
Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్