
ఏజెంట్ సినిమాతో అభిమానులకు పలకరించడానికి రెడీగా ఉన్నాడు అఖిల్ అక్కినేని. ఈసారి సాలిడ్ సినిమాతో వస్తున్నాడు. పక్కగా హిట్ కొడతానంటున్నాడు. ఇక మల్టీ స్టారర్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అఖిల్.
అఖిల్ హీరోగా చేసిన భారీ యాక్షన్ సినిమా ఏజంట్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈసినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీమ్. అఖిల్ ఈసారి ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. ఏ ఛాన్స్ వదిలిపెట్టకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చస్తు ప్రేక్షకుల ముందుకురావడానికి 'ఏజెంట్' రెడీ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ చురుగ్గా పాల్గొంటున్నాడు.
వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అఖిల్. ప్రెస్ మీట్లతో హడావిడి పెంచాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. 'ఏజెంట్' యాక్షన్ మూవీ అయినప్పటికీ, దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయి" అన్నాడు. సినిమా తప్పకుండా చూడాలని.. ఈసినిమాలో.. కొత్తగా కనిపించి ఆడియన్స్ మెప్పు పొందుతాన్నారు. మల్టీ స్టారర్ సినిమాల గురించి.. తన ఫ్యామిలతో నటించే విషయం గురించి కూడా కామెంట్స్ చేశారు అఖిల్. ఫ్యామిలీతో కలిసి నటించే విషయాన్ని గురించి స్పందిస్తూ .. మనం సినిమా లాంటి స్క్రిప్టులు తరచుగా చేయడం సాధ్యం కాదు. కావాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే కాంబినేషన్ కి ఉన్న విలువ పోతుంది అని అన్నారు అఖిల్.
ఇక తన అన్న అక్కినేని నాగచైతన్యతో కలసి ఎప్పుడు సినమిా చేస్తున్నారు అని అడగ్గా.. నేను మా అన్నయ్య కలిసి నటించడానికి అవకాశం ఉన్న కథ ఇంతవరకూ దొరకలేదు. అలాంటి కథ కుదిరితే తప్పకుండా అన్నయ్యతో చేస్తాను. మల్టీ స్టారర్ సినిమాలను గురించి నేను ఆలోచన చేయలేదుగానీ, ఒకవేళ చేయవలసి వస్తే మాత్రం రామ్ చరణ్ తో కలిసి చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని అన్నాడు. ఇక రామ్ చరణ్ తో కథ దొరికితే సినిమా చేయాలని ఉంది అన్నారు అఖిల్. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్స్ సినిమా చూడాలని ఉంది అటున్నారు అభిమానులు.