
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన తరువాత పూణెలో సెటిలైన సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా పరిశ్రమలో నిర్మాతగా, దర్శకురాలిగా సినిమాలు చేసిన ఆమె త్వరలో తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సారి మాత్రం బుల్లితెరపై అలరించనుంది రేణు దేశాయి. స్టార్ మా టీవీలో డాన్స్ రియాల్టీ షో ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సెప్టెంబర్ 30వ తేదీ నుండి మాటీవీలో ప్రసారం కానున్న 'నీతోనే డాన్స్' అనే డాన్స్ రియాల్టీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించబోతోంది. డాన్స్ విత్ రొమాన్స్ కాన్సెప్ట్ తో హిందీలో ప్రసారం అవుతున్న 'నాచ్ బలియే' తరహాలో ఈ షో ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ షో ప్రారంభానికి ముందే దుష్ప్రచారం మొదలు కావడం షాకింగ్ న్యూస్ గా మారింది. వాస్తవానికి ఈ షో ఎలా ఉంటుందో? ఎలాంటి కాన్సెప్టుతో సాగుతుందో అనే విషయాలు తెలియకుండా కొందరు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఈ షో ను టార్గెట్ చేసుకుని.. ఇది ‘ప్లాప్ షో' అంటూ నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు. దీంతో ఈ నెగెటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఒకట్రెండు సందర్భాల్లో రేణు దేశాయ్ ని టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి దీంతో ఈసారి కూడ పవన్ అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారా అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
ఎలాగైతేనేం.. భర్తను విడిచి వెళ్లినా.. రేణు దేశాయ్ తన ప్రతిభను చాటుకుంటూ... తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తోంది. కానీ ఆమెను టార్గెట్ చేస్తూ ఇప్పుడు వస్తున్న కామెంట్స్ కొంత హార్ట్ చేస్తున్నాయని రేణు దేశాయ్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తన టాలెంట్ ద్వారా షోని రన్ చేసి విమర్శకుల నోళ్లు మూయించాలని రేణు దేశాయి భావిస్తోందట. ఈమధ్య కాలంలో బుల్లితెరకు దూరమైన ఉదయ్ భాను యాంకర్ గా రేణు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ షో ‘బిగ్ బాస్’ షోను వీకెండ్ స్లాట్ లో రీప్లేస్ చేస్తూ.. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది.