నేను నిజాలు మాట్లాడితే.. మీరంతా నోళ్లు మూస్తారు: పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్

Published : Jun 29, 2018, 10:59 AM IST
నేను నిజాలు మాట్లాడితే.. మీరంతా నోళ్లు మూస్తారు: పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్

సారాంశం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో 

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆమెకు విషెస్ చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సహించడంలేదు. దీంతో వారికి తనదైన రీతిలో ఘాటు సమాధానాలు చెప్పుకుంటూ వస్తోంది రేణు. తాజాగా ఆమెపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ కావడంతో నేను రెచ్చిపోయి నిహాలు మాట్లాడితే మీరంతా నోరు మూసుకుంటారు అంటూ పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కామెంట్ చేసింది.

''పవన్ తో విడాకుల విషయంలో నేను చాలా ఏళ్లుగా మౌనంగా ఉండిపోయాను. దానికి మీరంతా నాకు థాంక్స్ చెప్పాలి. నిజంగా నేను నోరు విప్పి నిజాలు మాట్లాడితే మీరంతా నోళ్లు మూసుకుంటారు'' అంటూ ఘాటుగా స్పందించింది.

అలానే తనకు ఓరోజు వస్తుందని.. ఆ రోజు సోషల్ మీడియాలో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంటానని ఆ రోజు కోసం ప్రార్ధిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కామెంట్లు చేసిన కొంతసేపటికే తన అకౌంట్ నుండి ఈ కాన్వర్జేషన్ మొత్తాన్ని డిలీట్ చేసేసింది రేణు. ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి
కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ