పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తిన తన మాజీ భార్య రేణుదేశాయి

Published : Oct 14, 2017, 01:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తిన తన మాజీ భార్య రేణుదేశాయి

సారాంశం

స్టార్ మా ఛానెళ్లోో నిర్వహిస్తున్న నీతోనే డాన్స్ కార్యక్రమానికి జడ్జ్ గా రేణు దేశాయి రేణు దేశాయి ముందు పవన్ కళ్యాణ్ డాన్స్ ప్రదర్శన ఇచ్చిన ఓ కంటెస్టంట్ దానిపై స్పందిస్తూ పవన్ ఎనర్జీ లెవెల్స్ వేరంటూ తన మేనరిజం ఇమిటేట్ చేసిన రేణు

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయి ఇటీవల సెకండ్ మ్యారేజ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకూ అలాంటి అవసరం రాలేదని.. అయితే ఒంటరి జీవితానికి తోడు ఎప్పటికైనా అవసరమని, ఏం రాసి పెట్టి  వుందో ఎవరికి తెలుసు చూద్దాం అంటూ... అభిప్రాయాన్ని తెలియజేయడంతో పవన్ అభిమానులు ‘వదినమ్మా.. నువ్ ఎప్పటికీ మా అన్నకు వదినగానే ఉండాలమ్మా’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై కొంత మంది భిన్నాభిప్రాయాలను వ్యక్త పరచడంతో వదినమ్మ పవన్ అభిమానులపై ఆగ్రహాన్ని తెలియజేస్తూనే.. మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే తప్పా? మనం ఎలాంటి సొసైటీలో వున్నాం. మైండ్ సెట్ మారాలంటూ ఫైర్ అయ్యారు.


మరోవైపు రేణూదేశాయ్ సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన తరువాత ఇటీవల మళ్లీ బుల్లి తెరపై స్టార్ మా ఛానెల్‌లో సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమైన ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ప్రారంభంలో రేణూ దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన జానీ చిత్రంలోని పాట ఈ రేయి తీయనిది... అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేసింది.

 

తాజా ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్‌ స్టైల్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ మూవీ గెటప్‌తో వచ్చి పవన్‌లా నటించే ప్రయత్నం చేశారు. దీంతో అదే మూవీలో పవన్ జతకట్టిన రేణూ.. మీరు పవన్‌ని ఇమిటేట్ చేయాలనుకుంటే ఆయన స్థాయి వేరు. మీరు ఎంత చేసినా పవన్ చేసిన దాంట్లో కనీసం 10 % కూడా చేయలేరు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటీ.. ఆయన స్థాయి వేరు అంటూ పవన్ స్టైయిల్‌లో మెడపైకి చేయిపెట్టి మాజీ భర్త సిగ్నేచర్ స్టైల్‌ని దింపేసింది రేణూ దేశాయ్. దీంతో పవన్ అభిమానులు మా వదినమ్మకు మా అన్న అంటే ఎంత ఇష్టమో అంటూ ఈ వీడియో తెగ షేర్‌లు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు