వాణి విశ్వనాథ్ వ్యాఖ్యలకు వర్మ చురకలు

Published : Oct 13, 2017, 09:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
వాణి విశ్వనాథ్ వ్యాఖ్యలకు వర్మ చురకలు

సారాంశం

వర్మ ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ధర్నా చేస్తానన్న వాణి విశ్వనాథ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బయోపిక్ కాదన్న వర్మ వాణి వ్యాఖ్యలకు రాంగోపాల్ వర్మ ఘాటైన చురకలు

నైంటీస్ లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హిరోయిన్లలో వాణి విశ్వనాథ్ ఒకరు. వాణి విశ్వనాథ్ నటసార్వ భౌముడు ఎన్టీఆర్ సరసన సామ్రాట్ అశోక్ సినిమాలో నటించింది. తాజాగా వర్మ తెరకెక్కించ తలపెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా... కేవలం వివాదాలు చేస్తూ ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీయటం కోసం చేస్తున్న ప్రయత్నంగా తప్ప మరో కారణం ఏమీ ఆ సినిమా మేకర్స్ చూపించటం లేదని వాణి విశ్వనాథ్ ఆరోపించారు. వర్మ ఈ సినిమా ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిదని సూచించారు.

దీంతో వర్మ కూడా వాణి విశ్వనాథ్ కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. నా ఇంటి ముందు ధర్నాకు దిగితే నీ కాళ్లు కందిపోతాయంటూ వర్మ చురకలంటించారు.

వర్మ తన ఫేస్ బుక్ లో వాణి విశ్వనాథ్ కు ఏమని కౌంటర్ ఇచ్చారో చూడండి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వాణి విశ్వనాథ్

ఎన్టీఆర్ విరాభిమానిగా , ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి.
ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా

నా Reply:

వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?

PREV
click me!

Recommended Stories

మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు
అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?