అది నా కొడుకు రక్తంలోనే ఉంది: రేణుదేశాయ్!

Published : Jan 02, 2019, 12:46 PM IST
అది నా కొడుకు రక్తంలోనే ఉంది: రేణుదేశాయ్!

సారాంశం

ఒకప్పుడు నటిగా సినిమాలు చేసిన రేణుదేశాయ్.. పవన్ ని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. కానీ తనలో ఉన్న రచయిత్రిని మాత్రం విడిచిపెట్టలేదు. 

ఒకప్పుడు నటిగా సినిమాలు చేసిన రేణుదేశాయ్.. పవన్ ని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. కానీ తనలో ఉన్న రచయిత్రిని మాత్రం విడిచిపెట్టలేదు. పవన్ తో విడిపోయిన ఆమె రచయితగా, దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

ఇటీవల ఆమె రచించిన ఓ బుక్ ప్రమోషన్స్ కోసం పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆమెకు పవన్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు అకీరా నందన్ భవిష్యత్తులో హీరో అవుతాడా..? అని ప్రశ్నిస్తే.. దానికి రేణు ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.

''అకీరా ప్రస్తుతం అందరు టీనేజ్ అబ్బాయిలు చేసే పనులే చేస్తున్నాడు. ఫుట్ బాల్ ఆడుతున్నాడు, పియానో నేర్చుకుంటున్నాడు. ఇంకా తనకిష్టమైన పనులు చేస్తున్నాడు. ఒకవేళ అకీరా నటుడు కావాలనుకుంటే ఎవ్వరూ కూడా ఆ ఆలోచనను దూరం చేయలేరు. 

ఎందుకంటే అది తన జీన్స్ లోనే ఉంది'' అంటూ చెప్పుకొచ్చింది. రేణు మాటలను బట్టి అకీరా హీరో అవ్వాలనుకుంటే తనవైపు నుండి కావాల్సిన సపోర్ట్ ని ఇస్తుందని తెలుస్తోంది. 

పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ చేశారు.. రేణుదేశాయ్ కామెంట్స్!

పవన్ ముఖ్యమంత్రి అవుతాడా..? రేణుదేశాయ్ ఏమంటుందంటే?

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు