Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ చేశారు.. రేణుదేశాయ్ కామెంట్స్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఈ సమస్యపై చాలా మంది మహిళలు పోరాడుతున్నారు. తాజాగా మీటూ మూమెంట్ పై నటి రేణు దేశాయి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

renu desai comments on metoo movement
Author
Hyderabad, First Published Jan 1, 2019, 11:24 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఈ సమస్యపై చాలా మంది మహిళలు పోరాడుతున్నారు. తాజాగా మీటూ మూమెంట్ పై నటి రేణు దేశాయి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు తెలిసిన ఓ పదిహేనేళ్ల అమ్మాయిని రేప్ చేశారని, ఆ విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేయడానికి స్టేషన్ కి వెళ్తే అక్కడ కూడా తనను అత్యాచారం చేశారనే సంచలన విషయాలను వెల్లడించింది రేణు దేశాయ్.

మరిన్ని విషయాలను చెబుతూ.. ''మీటూ అనేది అన్ని చోట్లా ఉంటుంది. వ్యాపార రంగం, వైద్య రంగం, సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్ వేర్ ఫీల్డ్ ఇలా అన్ని చోట్లా ఉంటుంది. కానీ సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రీ కావడంతో ఇది ఎక్కువగా ఫోకస్ అవుతుంది. నాకు తెలిసి  సినిమాల్లో కంటే సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను మీటూ ఎక్స్ పీరియన్స్ చేయలేదు.

18ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. బద్రి సినిమా చేశాను.. ఆ తరువాత పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీటూ గురించి సోషల్ మీడియాలో బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీని వలన కొంతైనా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. అన్యాయం జరిగిన అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయాలన్నా కూడా భయమే.. ఎందుకంటే అక్కడ రౌడీలు కూడా ఉంటారు.

పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లిందని నానారకాలుగా మాట్లాడుకునే వారు చాలా మంది ఉంటారు. ఇటీవల నేనొక ఆర్గనైజేషన్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యాను. అక్కడ 15 ఏళ్ల అమ్మాయిని నాకు పరిచయం చేశారు. కొందరు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ విషయంపై కంప్లైంట్ చేయడానికి స్టేషన్ కి వెళ్తే.. అక్కడ కూడా తనను రేప్ చేశారు. ఇది విన్న తరువాత నాకు ఏడుపొచ్చింది.

పోలీసులు అందరూ ఇలానే ఉంటారని నేను చెప్పడం లేదు. ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని అంటున్నాను. ఇప్పుడు పోలీసులు చెడ్డవాళ్లు అని కామెంట్ చేశానని మళ్లీ నన్ను టార్గెట్ చేస్తారు. అందుకే క్లారిటీ ఇస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో అబ్బాయిలను సరిగ్గా పెంచితే అమ్మాయిలకు ఎలాంటి సమస్యలు ఉండవని, సమాజం బాగుంటుందని అన్నారు. తన కొడుకు అకీరాను మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా పెంచుతున్నానని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios