మార్కెట్ లో కొత్తమ్మాయి రేటు రూ.240 కోట్లు!

Published : Jan 02, 2019, 12:20 PM IST
మార్కెట్ లో కొత్తమ్మాయి రేటు రూ.240 కోట్లు!

సారాంశం

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ డాటర్ సారా అలీ ఖాన్. ఆమె నటించిన మొదటి సినిమా 'కేథార్ నాథ్' కి హిట్ టాక్ రానప్పటికీ హీరోయిన్ గా సారాకి మంచి మార్కులే పడ్డాయి. 

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ డాటర్ సారా అలీ ఖాన్. ఆమె నటించిన మొదటి సినిమా 'కేథార్ నాథ్' కి హిట్ టాక్ రానప్పటికీ హీరోయిన్ గా సారాకి మంచి మార్కులే పడ్డాయి. 

నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న సారా రీసెంట్ గా 'సింబా' చిత్రంతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సారా నటించిన ఈ రెండు సినిమాల థియేట్రికల్ వేల్యూయేషన్ రెండు వందల నలభై కోట్లు పలికిందట.

స్టార్ హీరోయిన్ల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ ఫిగర్ ని కెరీర్ ఆరంభంలోనే సాధించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లకు పెళ్లిళ్లు అయిపోవడం, కత్రినా లాంటి హీరోయిన్లకు హిట్లు లేకపోవడం, అలియా భట్ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుండడంతో ఇప్పుడు దర్శకనిర్మాతలకు కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గా సారా రూపంలో మంచి ఆప్షన్ దొరికింది.

ప్రస్తుతం ఆమెను సంప్రదించే నిర్మాతల సంఖ్య పెరుగుతోందట. ఆమె మాత్రం తన బాధ్యతలు మొత్తం కరణ్ జోహార్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.    

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?