
నాలుగు రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం ‘గని’Ghani థియేటర్లలోకి రానుంది. తొలిసారిగా వరుణ్ బాక్సర్ గా తెరపై కనిపించనుడటం పట్ల అభిమానులు, ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రెట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’RRRతో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ కోసం విలాసవంతమైన వీక్షణ కోసం ప్రేక్షకుడు రూ. 400 వరకు టికెట్ కు చెల్లించాల్సి ఉంది.
అయితే టికెట్ రెట్లు అధికంగా పెరగడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లలో సినిమా చూసేందుకు కాస్తా వెనుకడుగే వేస్తున్నారని చెప్పాలి. మరోవైపు చిన్న సినిమాలు కూడా పెరిగిన టికెట్ ధరలతో తమ సినిమాను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారనే చెప్పాలి. ఇప్పటికే అధిక టిక్కెట్ ధరలతో, RRR ఫీవర్ క్రమంగా తగ్గిపోతుంది మరియు ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే చిన్న సినిమాలు మల్టీప్లెక్స్‌లలో మరియు సింగిల్ స్క్రీన్‌లలో ప్రేక్షకులను రప్పించడంలో కష్టపడుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం (TS Government) టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా, వరుణ్ తేజ్ ‘గని’మూవీకి సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరుణ్ తేజ్ బాక్సర్‌గా మొదటి పాత్ర చేస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా చుట్టూ చాలా ఉత్కంఠ నెలకొంది. ఇంత ఎక్కువ టిక్కెట్ ధరలతో సినిమాల వైపు వెళ్లేందుకు ప్రేక్షకులకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టికెట్ రేట్లు తగ్గించడంతో కొంత గనిమూవీకి ప్లస్ పాయింట్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత తగ్గించిన రేట్ల ప్రకారం.. మల్టీప్లెక్స్‌లు : రూ.200 + GST, సింగిల్ స్క్రీన్‌లు : GSTతో కలిపి రూ.150గా నిర్ణయించారు.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే నూతన దర్శకుడిగా పరిచయం కానున్నాడు. నిర్మాతలుగా అల్లు బాబీ, సిద్దు ముద్దా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో నదియా, ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ సెట్టి, సాయి మంజ్రేకర్, నరేష్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందించారు.