Thalapathy Vijay: థియేటర్ ని నామరూపాల్లేకుండా చేసిన విజయ్ ఫ్యాన్స్.. విధ్వంసం

Published : Apr 04, 2022, 02:01 PM IST
Thalapathy Vijay: థియేటర్ ని నామరూపాల్లేకుండా చేసిన విజయ్ ఫ్యాన్స్.. విధ్వంసం

సారాంశం

ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళ నాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానం సొంతం చేసుకున్న నటుడు విజయ్. 

ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళ నాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానం సొంతం చేసుకున్న నటుడు విజయ్. విజయ్ నటించిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. 

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న బీస్ట్ చిత్రంపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. బీస్ట్ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. వీర రాఘవన్ అనే ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఉగ్రవాదులు ఓ షాపింగ్ మాల్ లో ప్రజలని బంధించగా వారిని రెస్క్యూ చేసే పవర్ ఫుల్ సైనికుడిగా విజయ్ కనిపిస్తున్నాడు. 

ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్, విజయ్ సాహసాలు, డైలాగులు  అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ట్రైలర్ ని తమిళనాడు వ్యాప్తంగా చాలా థియేటర్స్ లో విడుదల చేశారు. ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో తిరునల్వేలిలో రామ్ థియేటర్ లో ఊహించని సంఘటన జరిగింది. ట్రైలర్ ఇచ్చిన జోష్ తో అభిమానులు పట్టరాని సంతోషానికి గురయ్యారు. 

దీనితో థియేటర్ లో ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఫ్యాన్స్ చేసిన విధ్వంసంతో రామ్ థియేటర్ నామరూపాల్లేకుండా పోయింది. దీనితో ఈ  థియేటర్ లో సినిమా ప్రదర్శించాలి అంటే తప్పనిసరిగా మరమ్మతులు చేయాలి. దీనితో థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమా విడుదల రోజుల విజయ్ అభిమానుల వీరంగం ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?