
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఒక వైపు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే.. మరో వైపు ట్రిపుల్ ఆర్ హీరోలకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. హిందీలో కూడా యంగ్ హీరోలకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. రీసెంట్ గా చరణ్ ను ముంబయ్ లో ఊపిరి ఆడనంతగా అభిమానులు ముంచెత్తారు.
మెగా హీరో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆంథ్రా రాటుకుని చరణ్ క్రేజ్ బాలీవుడ్ చేసింది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందే రామ్ చరణ్ జంజీర్( తెలుగులో తుఫాన్) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్రియాంక చోప్రా నటించింది. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించినంత విజయం సాధించలేకపోయింది.
ఇప్పుడు తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి దుమ్మురేపుతోంది. ఈ మూవీ హిందీలో సైతం దూసుకుపోతోంది. రాజమౌళి డైక్షన్ లో ఎన్టీఆర్, చరణ్ ల మల్టీ స్టారర్ కు.. అందులో యంగ్ హీరోల యాక్టింగ్ కు నార్త్ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, చరణ్ కు నార్త్ లో సైతం క్రేజ్ బాగా పెరిగిపోయింది.
ఇక రీసెంట్ గా చరణ్ కు డిఫరెంట్ అనుభవం ఎదురయ్యింది. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూసేందుకు నిన్న సాయంత్రం ముంబై బాంద్రాలోని గెయిటీ గెలాక్సీకి రామ్ చరణ్ వెళ్లాడు. అక్కడ చరణ్ ను చూసిన అభిమానులు చుట్టుముట్టారు. దాంతో చుట్టు ఉన్న భౌన్సర్లు కూడా ఏం చేయలేకపోయారు. చరణ్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. చరణ్ కూడా ఎంతో ఉత్సాహంగా వారితో కలిసిపోయాడు. ప్రేక్షకుల అభిమానానికి ఎంతో ఆనందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.