జబర్దస్త్ "స్మగ్లర్" హరిబాబు అరెస్ట్.. మరో ఇద్దరు నటుల ప్రమేయం.. పోలీసుల గాలింపు

First Published Jul 17, 2018, 12:48 PM IST
Highlights

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుల్లితెర నటుడు హరిబాబును టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుల్లితెర నటుడు హరిబాబును టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన హరిబాబు నటన మీద ఆసక్తితో చిన్నా చితకా పాత్రలు వేసుకునేవాడు.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని తాను కూడా స్మగర్‌గా మారాడు. విద్యార్థులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా వేసి వారి సాయంతో ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించేవాడు.

బుల్లితెర మీద చిన్న చిన్న పాత్రలు వేస్తూ.. తన దందాను కొనసాగించేవాడు. స్మగ్లింగ్‌లో కోట్లు సంపాదించి ఆ డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవల షకలక శంకర్ హీరోగా నటించిన ఓ సినిమాకు హరిబాబు ఫైనాన్స్ చేసినట్లుగా సమాచారం. 2012 నుంచి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో అతనిపై 10 స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి.

హరిబాబు వ్యవహారం బయటకు రావడంతో ఇతని ఆచూకీ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. ఎట్టకేలకు అతనిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో మరో ఇద్దరు నటులకు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం టాస్క్‌ఫోర్స్ గాలిస్తోంది.
 

click me!