మళ్ళీ రిస్క్ చేసిన యూవీ క్రియేషన్స్.. సైరాకు రికార్డ్ ధర!

Published : Sep 05, 2019, 08:08 PM IST
మళ్ళీ రిస్క్ చేసిన యూవీ క్రియేషన్స్.. సైరాకు రికార్డ్ ధర!

సారాంశం

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. 

ఇటీవల విడుదల చేసిన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, తమన్నా, నయనతార లాంటి స్టార్ కాస్టింగ్ కూడా సైరా చిత్రానికి కలసి వచ్చే అంశం. ట్రేడ్ వర్గాల్లో సైరాపై భారీ అంచనాలే ఉన్నాయి. తన రీఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 తో చిరంజీవి రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టారు. 

సైరా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది కాబట్టి అంతకు మించిన అంచనాలే ఉన్నాయి. తాజాగా సైరా చిత్ర గుంటూరు ఏరియా రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. సాహో లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థే సైరా గుంటూరు హక్కులని 11.5 కోట్లకు దక్కించుకుంది. 

బాహుబలి మినహా మరే చిత్రం గుంటూరులో 10 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేదు. సైరా చిత్రం ఆ ఫీట్ అందుకుంటుందేమో వేచి చూడాలి. 

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక అదేనా.. చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ ?

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే