వరదలో చిక్కుకున్న కారు.. వీడియో తీసిన హీరో.. కౌంటర్ అదిరింది!

Published : Sep 05, 2019, 07:44 PM IST
వరదలో చిక్కుకున్న కారు.. వీడియో తీసిన హీరో.. కౌంటర్ అదిరింది!

సారాంశం

బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జుజ్ రాంపాల్ ఆ మధ్యన సౌతాఫ్రికాకు చెందిన ఓ మోడల్ తో డేటింగ్ లో ఉన్న వ్యవహారం వార్తలో నిలిచింది. తొలి భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఈ హీరో గాబ్రియెల్లా అనే మోడల్ తో సంజీవనం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అర్జున్ రాంపాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. 

ముంబైలో జోరున కురుస్తున్న వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తోంది. ముంబై రహదారుల్లో ఓ లగ్జరీ కారు వరదలో చిక్కుకుపోగా.. దానిని అర్జున్ రాంపాల్ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాహన దారులని హెచ్చరించాడు. ఇలాంటి వరద సమయాల్లో లగ్జరీ కార్లు వర్కౌట్ కావు. ఇండియన్ కార్లు మాత్రమే ఈ వరదని తట్టుకోగలవు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని పోస్ట్ పెట్టాడు. 

దీనిపై కొందరు నెటిజన్లు అర్జున్ రాంపాల్ ని విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు. ఓ నెటిజన్ ' ఏం మాట్లాడుతున్నారు మీరు.. ముందు మీరు రేంజ్ రోవర్ కారు వాడడం మానేసి మారుతీ ఆల్టో కారు కొనండి.. అప్పుడు ఇలాంటి విషయాలు చెప్పండి' అని కామెంట్ పెట్టాడు. 

అతడికి అర్జున్ రాంపాల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. 'నేను ఈ వీడియో తీసింది మారుతీ ఆల్టో లోనుంచే' అని సమాధానం ఇచ్చాడు. దీనితో నెటిజన్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!