ఇప్పుడు పుష్ప సైతం దుబాయి ప్రమోషన్స్ ను వద్దనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అసలు ఇలా దుబాయి ఈవెంట్స్ కాన్సిల్ చేసుకోవటానికి ప్రత్యేక కారణమేంటనేది హాట్ టాపిక్ గా మారింది.
తెలుగులో ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న ప్యాన్ ఇండియా సినిమాలు పుష్ప, ఆర్ ఆర్ ఆర్ . ఈ రెండు సినిమాలు భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేయటానికి ప్లాన్ చేసారు. అంతకు ముందే అందరి దృష్టీని ఆకర్షించటానికి దుబాయిలో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేసారు. రాజమౌళి, కార్తికేయ, నిర్మాత దానయ్య కలిసి దుబాయి వెళ్లి వెన్యూని ఫైనలైజ్ చేసారు. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ని కాన్సిల్ చేసినట్లు సమాచారం. అయితే ఎందుకు కాన్సిల్ అయ్యిందనే విషయం బయిటకు రాలేదు. అలాగే ఇప్పుడు పుష్ప సైతం దుబాయి ప్రమోషన్స్ ను వద్దనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అసలు ఇలా దుబాయి ఈవెంట్స్ కాన్సిల్ చేసుకోవటానికి ప్రత్యేక కారణమేంటనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ ఈవెంట్ కు సినిమాలో చేసిన స్టార్స్ ని తీసుకెళ్లి అక్కడ వాళ్లకు వసతులు చూపటానికి చాలా ఖర్చు అవుతోందని భావించారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ ఇలా వరసగా చాలా మంది ఉన్నారు. వారందిరతో వెళ్ళాలి. మరో ప్రక్క కరోనా కేసులు కూడా మళ్లీ మొదలయ్యాయి. ఆ భయం కొంత వాళ్లను వెనక్కి లాగింది.
undefined
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రంగా పుష్పను చేస్తోన్న విషయం తెల్సిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ లో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప ప్రమోషన్స్ జోరుగా సౌగుతున్నాయి. డిజిటల్ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా పుష్ప విషయంలో భారీ ప్రమోషన్స్ ను చేపట్టనున్నారట. వివిధ సిటీలలో పుష్ప ఈవెంట్ ను నిర్వహిస్తారని తెలుస్తోంది. హిందీ థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయిందట. పుష్ప ది రైజ్ హిందీలో కూడా విడుదల కానుంది.
Also read ఓటీటిలో 'రిపబ్లిక్': క్రేజ్ కోసం దేవకట్టా కొత్త ప్రయోగం, వర్కవుట్ అవుతుందా?
ఇదిలా ఉంటే పుష్ప ప్రమోషనల్ ఈవెంట్ ను దుబాయ్ లో కూడా నిర్వహించాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించాలని ఫిక్స్ అయ్యారట. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
Also read అల్లు అర్జున్ “పుష్ప” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్