Bramhanandam: నన్ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేస్తుంది వాళ్లే!

Published : Nov 24, 2021, 10:21 AM IST
Bramhanandam: నన్ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేస్తుంది వాళ్లే!

సారాంశం

ది కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం ఏమి చేసినా హాస్యం పండుతుంది. ఆయన నరనరాల్లో హాస్యం జీర్ణించుకు పోగా, ప్రతి హావాభావంతో నవ్వులు కురిపిస్తారు నవ్వుకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బ్రహ్మానందం నటుడిగా అనేక శిఖరాలకు చేరారు.    

ఆ మధ్య తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న బ్రహ్మానందం (Bramhanandam)సినిమాల జోరు తగ్గించారు. ఆయన చాలా సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా ఉండేది. కాదు స్టార్స్ నుండి అప్ కమింగ్ హీరోల వరకు తమ చిత్రాలలో బ్రహ్మానందం ఉండేలా పాత్రలు సృష్టించేవారు. బ్రహ్మానందం కామెడీ వలనే విజయం సాధించిన సినిమాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.


షూటింగ్స్ కి విరామం ప్రకటించిన బ్రహ్మానందం ఖాళీగా లేరు. తనకు తెలిసిన మరికొన్ని విద్యలను బ్రహ్మానందం ప్రేక్షకులకు పరిచయం చేశారు. బ్రహ్మానందం గొప్ప పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ కూడాను.ఆయన బ్రహ్మాండంగా బొమ్మలు గీస్తారు. లాక్ డౌన్ సమయంలో రామాంజనేయులు, వెంకటేశ్వర స్వామి, శ్రీరామ పట్టాభిషేకం వంటి అరుదైన చిత్రాలు ఆయన గీశారు. సదరు చిత్రాలను ఫ్రేమ్ కట్టించి, తనకు ఇష్టమైన స్టార్స్ కి బహుమతిగా ఇచ్చారు. 


కాగా బ్రహ్మానందం చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలుగు పాపులర్ టాక్ షోలలో ఒకటిగా ఉన్న ఆలీతో సరదాగా (Alitho saradaga)కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కెరీర్ బిగినింగ్ నుండి, ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటనలను ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఫొటోలతో మీమ్స్ చేసే మీమర్స్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Also read 'ఎఫ్ 3' క్లైమాక్స్ లో ప్యాన్ ఇండియా సర్పైజ్
నవరసాలు అవలీలగా ముఖంలో పలికించే బ్రహ్మానందం ముఖం... ఎటువంటి విమర్శకైనా, సెటైర్స్ కి అయినా చక్కగా సరిపోతుంది. దీంతో పొలిటికల్, స్పోర్ట్స్, సినిమా... టాపిక్ ఏదైనా బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ తో అద్భుతమైన మీమ్స్ రెడీ అవుతాయి. ఈ మీమ్స్ రాయుళ్లకు బ్రహ్మానందం ధన్యవాదాలు తెలిపారు. నేను సినిమాలలో నటించకపోయినా, ఈ మీమ్స్ ద్వారా ప్రేక్షకులు నన్ను మర్చిపోకుండా చేస్తున్నారు.. అంటూ బ్రహ్మానందం తన ఫొటోలతో క్రియేట్ చేసే మీమ్స్ పై స్పందించారు. 

Also read అల్లు అర్జున్ “పుష్ప” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?