ఓటీటిలో 'రిప‌బ్లిక్‌': క్రేజ్ కోసం దేవకట్టా కొత్త ప్రయోగం, వర్కవుట్ అవుతుందా?

By Surya Prakash  |  First Published Nov 24, 2021, 9:53 AM IST

 ఈ నెల 26 నుంచి 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ ప్రయోగం సక్సెస్ అయ్యితే భవిష్యత్ చాలా సినిమాలు డైరక్టర్ కామెంటరీతో వస్తాయి..కావాలని ఓటీటి సంస్దలు కూడా అడుగుతాయనటంలో సందేహం లేదు.  


సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడీ ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో!

భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యిన ఈ సినిమాకు ఓటీటిలో  క్రేజ్ తేవటం కోసం దేవకట్టా ఈ ఆలోచన చేసినట్లు సమాచారం.  సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే... తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే? అటువంటి ప్రయత్నానికి 'జీ 5', దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్... ముగ్గురితో 'రిపబ్లిక్' విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. ఈ నెల 26 నుంచి 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ ప్రయోగం సక్సెస్ అయ్యితే భవిష్యత్ చాలా సినిమాలు డైరక్టర్ కామెంటరీతో వస్తాయి..కావాలని ఓటీటి సంస్దలు కూడా అడుగుతాయనటంలో సందేహం లేదు.  

Latest Videos

undefined

Also read Jersey Trailer: నానిని దించేసిన షాహిద్‌ కపూర్‌.. `జెర్సీ` హిందీ ట్రైలర్‌ ట్రెండింగ్‌

ఇక ‘‘రిపబ్లిక్’’ ఓ సీరియస్ మూవీ. రాజకీయాలు, బ్యూరోక్రసీ గురించి తెలిసిన వాళ్లు కనెక్ట్ అవుతారు.  కమర్షియల్ అప్సీల్ చాలా తక్కువ.దేవకట్టా అనుకున్న పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు స్టార్ అప్పీల్ ఉంటే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది.కానీ సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరో ఇంత సీరియస్ సబ్జెక్ట్ ను హ్యండిల్ చేయలేకపోయాడని అన్నారు. డైరక్టర్ చెప్దామనుకున్న పాయింట్ ఏమిటనేది ఆడియన్స్ కు సరిగా కన్వే కాలేదు. డైరెక్టర్ దేవకట్టా కూడా ఈ సబ్జెక్ట్ ను మరింత సీరియస్ గా కాంప్లికేటెడ్ గా చెప్పాడన్నారు. 
 

click me!