ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

Published : Oct 17, 2018, 03:01 PM IST
ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

సారాంశం

అప్పటివరకు ఎలాంటి ఇమేజ్ లేని నటి కీర్తి సురేశ్ కి 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ వచ్చేసింది. ప్రస్తుతం దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంటుంది. సావిత్రి పాత్రలో ఆమె నటనకి యూత్ తో పాటు పెద్దలు సైతం ఫిదా అయిపోయారు.

అంతగా సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించింది. అటువంటి పాత్రలో మరోసారి నటించే అవకాశం వస్తే మాత్రం నో చెప్పేసింది కీర్తి సురేశ్. దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేశ్ ని సంప్రదించగా ఆమె అంగీకరించలేదు. దానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ''మహానటి అనేది ఒక మ్యాజిక్. మళ్లీ నేను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు.

అందుకే ఆ పాత్రను మళ్లీ టచ్ చేయాలనుకోలేదు. సావిత్రి మాత్రమే కాదు.. ఇకపై బయోపిక్ సినిమాలు వేటిలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కనిపించే అవకాశం ఉంది. 
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు