విశాల్ కి మళ్లీ దెబ్బ పడుతుందా..?

Published : Oct 17, 2018, 02:31 PM IST
విశాల్ కి మళ్లీ దెబ్బ పడుతుందా..?

సారాంశం

మాస్ హీరో విశాల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నా.. టైమ్ బాగోకపోవడంతో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. సోలో రిలీజ్ దొరకపోవడంతో పోటీ మధ్య సినిమాలను రిలీజ్ చేయడం ఒక కారణమని చెప్పొచ్చు. దాదాపు అతడి సినిమాలన్నీ కూడా పోటీ వాతావరణంలోనే విడుదల అవుతుంటాయి.

మాస్ హీరో విశాల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నా.. టైమ్ బాగోకపోవడంతో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. సోలో రిలీజ్ దొరకపోవడంతో  పోటీ మధ్య సినిమాలను రిలీజ్ చేయడం ఒక కారణమని చెప్పొచ్చు.

దాదాపు అతడి సినిమాలన్నీ కూడా పోటీ వాతావరణంలోనే విడుదల అవుతుంటాయి. దీంతో ఆ ప్రభావం విశాల్ సినిమాపై బాగా పడుతోంది. విశాల్ నటించిన తాజా చిత్రం 'పందెంకోడి2' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అటు తమిళంలో ఇటు తెలుగులో సినిమాకి గట్టి పోటీ ఎదురవుతోంది.

తమిళంలో ధనుష్ 'వడా చెన్నై'కి విపరీతమైన బజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. కానీ విశాల్ సినిమాకి మాత్రం కనీసపు బుకింగ్స్ లేవు. మరోపక్క తెలుగులో 'అరవింద సమేత' థియేటర్లలో ఉంది. హలో గురు ప్రేమకోసమే సినిమా కోసం దిల్ రాజు ఎక్కువ థియేటర్లు ఆక్రమించారు.

ఈ క్రమంలో విడుదలవుతున్న విశాల్ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లలో మాత్రం దెబ్బ పడే అవకాశం ఉంది. తెలుగులో ఈ మధ్యకాలంలో సరైన మాస్ సినిమా రాకపోవడంతో బి,సి సెంటర్స్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Release పై మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్