మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

Published : Oct 17, 2018, 02:36 PM IST
మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి సినిమాతో బిజినెస్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. మహేష్ సినిమా మొదలుకాకముందే చాలా వరకు ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన బిజినెస్ లు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి సినిమాతో బిజినెస్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. మహేష్ సినిమా మొదలుకాకముందే చాలా వరకు ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన బిజినెస్ లు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. ఇకపోతే నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి రానున్న మహర్షి సినిమా బిజినెస్ కూడా అన్ని వైపులా ముగింపుకు వస్తోంది. 

రీసెంట్ గా బ్రాడ్ క్యాస్ట్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సన్ నెట్వర్క్ కి సంబందించిన జెమినీ టీవీ మహర్షి శాటిలైట్ రైట్స్ ను చేజిక్కించుకుంది. ఇంతకుముందు ఆ ఛానల్ మహేష్ బాబు -బిజినెస్ మెన్, 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలను మంచి రేట్ కు కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరక్కుతున్న మహర్షి సినిమాను దక్కించుకున్నారు. 

ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా అల్లరి నరేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మహర్షి సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న  రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ముందే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా సినిమా రావడానికి 169 రోజులుందన్నమాట.

PREV
click me!

Recommended Stories

Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే
Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?