‘రాజా ది గ్రేట్’ సినిమా రీ షూట్ చేస్తున్నారా?

Published : Sep 23, 2017, 04:25 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
‘రాజా ది గ్రేట్’ సినిమా రీ షూట్ చేస్తున్నారా?

సారాంశం

రవితేజ హీరోగా నటిస్తున్న తాాజా చిత్రం ‘ రాజా ది గ్రేట్’ అంధుడిగా నటిస్తోన్న రవితేజ ప్రత్యేక గీతంలో రాశీఖన్నా

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాశీఖన్నా ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే.. ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని  దీపావళి కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తోంది. అయితే.. ఈ సినిమాలోని కొన్ని సీన్లను మళ్లీ రీ షూట్ చేయాలని నిర్మాత దిల్ రాజు కోరారట.  దిల్ రాజు నిర్మాతగా వరస విజయాలను అందుకుంటున్నారు. దీంతో ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారట. అందులో భాగంగానే రీ షూట్ చేయించాలని భావిస్తున్నారట.

 

సినిమా సెకండ్ హాఫ్ విషయంలో నిర్మాత దిల్ రాజు సంతృప్తిగా లేరట. అందుకని రెండో భాగాన్ని రీషూట్ చేయమని దర్శకుడు అనిల్ రావిపూడికి సూచించినట్లు తెలుస్తోంది. తాను నిర్మించే సినిమాల విషయంలో దిల్ రాజు చాలా స్పష్టతతో ఉంటారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. అయితే రీషూట్ చేయడం అనే విషయంలో రవితేజ సుముఖంగా లేడని తెలుస్తోంది. దీని వల్ల ఆయన సైన్ చేసిన ఇతర సినిమాల షెడ్యూల్స్ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కానీ దిల్ రాజు మాత్రం రీషూట్ చేయాల్సిందేనని అంటున్నారట. మరి సినిమాను అనుకున్నట్లుగా అక్టోబర్‌లో విడుదల చేస్తారో..? లేక వాయిదా వేస్తారో..? చూడాలి!

 

మాస్ మహారాజా రవితేజకి ఈ ఏడాది ఎదురుదెబ్బలు చాలా తగిలాయి. జూన్‌లో తమ్ముడు భరత్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ బాధ నుంచి కోలుకునేలోపే డ్రగ్స్ కేసులో రవితేజ పేరు వినిపించింది. సిట్ విచారణకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. ఈ రెండు సంఘటనలు రవితేజ కుటుంబాన్ని కుదిపేశాయి. ఇప్పుడు సినిమాల పరంగా కూడా రవితేజకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ‘టచ్ చేసి చూడు’ సినిమా అనుకున్నట్లు రావడం లేదని దాన్ని పక్కన పెట్టాడు రవితేజ. అక్టోబర్‌లో విడుదలకు సన్నద్ధమవుతున్న మరో సినిమా ‘రాజా ది గ్రేట్’ విషయంలోనా అదే పరిస్థితి ఏర్పడింది.

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ