ప్రేమతో మీ నివేదా ‘ట్వీట్’

Published : Sep 23, 2017, 03:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రేమతో మీ నివేదా ‘ట్వీట్’

సారాంశం

‘జెంటిల్ మన్’ తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నివేదా ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాతో హిట్  కొట్టిన నివేదా అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసిన నివేదా

‘జెంటిల్ మన్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది నివేదా థామస్. నానితో కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో నివేదాకు అవకాశాలు క్యూలు కట్టాయి. ఆ తర్వాత ఈ మళయాళ భామ.. మరోసారి నానితో జతకట్టింది. ‘నిన్ను కోరి’ అంటే ఈ సంవత్సరం మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. వెంటనే ఎన్టీఆర్ తో నటించే అవకాశం కొట్టేసింది.

 

ఎన్టీఆర్ కథానాయకుడిగా, నివేదా హీరోయిన్ గా నటించిన ‘జై లవ కుశ’ చితం ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. తాను నటించిన మూడు చిత్రాలు వరసగా విజయం సాధించడం పట్ల నివేదా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు.

 

‘ ఒక్క ఫిల్మ్ హిట్ అవ్వడం స్పెషల్.. చేసిన మొదటి మూడు సినిమాలను ఇంత బాగా అప్రిషియేట్ చేసి, తెలుగు ఇండస్ట్రీలో  ‘మా అమ్మాయి’ అని పిలవడం. దీనికన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏదీ లేదు. ఇట్ ఈజ్ ఏ  బ్లెస్సింగ్. నా ఫ్యాన్స్.. నా ఫ్యామిలీ అయిపోయారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ‘జై లవ కుశ’ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు థాంక్యూ. మరో  అందమైన సినిమాలో మరో కొత్త క్యారెక్టర్ తో త్వరలోనే కలుస్తా. ప్రేమతో మీ నివేదా థామస్’ అంటూ ట్వీట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?