మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్సీ15’. ఎప్పటి నుంచో షూటింగ్ కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అందలేదు.
స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. చిత్రాన్ని RC15 వర్క్ టైటిల్ తో ప్రస్తుతం శరవేగంగా షూట్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ‘దిల్’ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన సీన్లను కూడా శంకర్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం చార్మినార్ దగ్గర షూట్ కొనసాగనున్నట్టు దర్శకుడు అప్డేట్ అందించారు. 500 మంది డ్యాన్సర్లో ఓ క్రేజీ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి అభిమానులకు ఎలాంటి అప్డేట్ అందించారు. దీంతో ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అవుతున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవుతున్న ఫొటోలు, వీడియోలతోనే హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈక్రమంలో RC15 టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా క్రేజీ బజ్ అయితే వినిపిస్తోంది. వచ్చే నెల మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు ఉండటంతో.. అప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు.. టైటిల్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు.
ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ‘ఆర్సీ15’ నుంచి అప్డేట్ వస్తుందనే ఆశతోనే ఉన్నారు. ఈ క్రమంలో మేకర్స్ అప్సెట్ చేయరని భావిస్తున్నారు. ఈఏడాది ఏప్రిల్ లో షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రి, కర్నూల్, పంజాబ్, న్యూజిలాండ్ తోపాటు ఆయా లోకేషన్లలో షూటింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత మళ్లీ రాజమండ్రికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారంట. మరోవైపు ‘అధికారి’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. మూవీలో చరణ్ ప్రభుత్వ అధికారిగానూ, స్టూడెంట్ గానూ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సరైన టైటిట్ ను ఎంపికచేయడంలో కాస్తా ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.