కియారా-సిద్దార్థ్ పెళ్లి వీడియో: వధువు కోసం వరుడు ఎదురు చూపులు... క్యూట్ అండ్ రొమాంటిక్! 

Published : Feb 10, 2023, 05:22 PM ISTUpdated : Feb 13, 2023, 09:27 PM IST
కియారా-సిద్దార్థ్ పెళ్లి వీడియో: వధువు కోసం వరుడు ఎదురు చూపులు... క్యూట్ అండ్ రొమాంటిక్! 

సారాంశం

అత్యంత సన్నిహితుల మధ్య కియారా-సిద్ధార్థ్ ల వివాహం ముగిసింది. వివాహమైన మూడు రోజుల తర్వాత కియారా పెళ్లిలోని ఓ రొమాంటిక్ మూమెంట్ ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.   

సూర్యఘడ్ కోట ఆవరణలో వధువు కోసం వరుడు వేచి చూస్తుండగా వధువు ప్రవేశించింది. కోట తలుపులు తీయగా చీకటిని చీల్చుతూ సూర్య కిరణాలు వధువుని ఆవరించాయి. ముత్యాల పందిరిలో పెళ్లి కూతురు దేవతలా ప్రత్యక్షమయ్యింది. వధువు కనిపించాక క్షణం కూడా వరుడు నిరీక్షించలేకపోయాడు. వధువు చిలిపి తనానికి కొంటెగా నొచ్చుకున్నాడు. ఆమె దరిచేరాక పేమ మైకంలో పడి ముద్దులతో ముంచెత్తాడు.. 

పెళ్లి వేడుకలో వధువు కియారా-వరుడు సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య జరిగిన ఈ మనోహర క్షణాలు వీడియోలో బంధించారు. సదరు వీడియో కియారా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వారిద్దరూ జంటగా నటించిన షేర్షా చిత్రంలోని 'రంజా' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా సిద్దార్థ్-కియారా పెళ్లి వీడియో మైమరిపించింది. ప్రత్యేకంగా కంపోజ్ చేసినట్లు సెట్ అయ్యింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు ఉన్న జంటను చూసి మెచ్చుకోకుండా ఉండలేకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

దాదాపు ఐదేళ్లుగా కియారా-సిద్దార్ద్ ప్రేమించుకుంటున్నారు. లస్ట్ స్టోరీస్ సిరీస్ షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా యూనిట్ ఏర్పాటు చేసిన పార్టీలో కియారాను సిద్దార్థ్ మొదటిసారి కలిశారు. అప్పుడు మొదలైన పరిచయం షేర్షా మూవీ సెట్స్ లో బలపడింది. ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 

తమ ప్రేమ పై ఎన్నడూ అధికారిక ప్రకటన చేయలేదు. పైగా వార్తలను ఖండిస్తూ వచ్చారు. దీంతో వీరి బంధం పెళ్లి వరకూ వెళుతుందా లేదా అనే సందేహం కలిగింది. ఫిబ్రవరి 7న బంధుమిత్రుల నడుమ కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టి ఆమెను సొంతం చేసుకున్నారు. పెళ్లి జరిగే వరకు ఎలాంటి ప్రకటనలు చేసుకోకూడదని వారి మధ్య ఒప్పందం ఉందట. ఆ కారణంగా పెళ్లికి కొన్ని రోజులు ముందు కూడా సిద్ధార్థ్ పెళ్లి వార్తలను పరోక్షంగా ఖండించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?