కార్తికేయ `బెదురులంక` టీజర్‌.. 2012 డిసెంబర్‌ 21న ఆ లంక గ్రామంలో ఏం జరిగింది?

Published : Feb 10, 2023, 06:12 PM ISTUpdated : Feb 10, 2023, 06:19 PM IST
కార్తికేయ `బెదురులంక` టీజర్‌.. 2012 డిసెంబర్‌ 21న ఆ లంక గ్రామంలో ఏం జరిగింది?

సారాంశం

కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం `బెదురులంకః2012`. `డీజే టిల్లు` భామ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. హీరో విజయ్‌ దేవరకొండ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు.  

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం `బెదురులంకః2012`. `డీజే టిల్లు` భామ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. తాజాగా టీజర్‌ విడుదలైంది. శుక్రవారం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో టీజర్‌ని రిలీజ్‌ చేశారు. హీరో విజయ్‌ దేవరకొండ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు. తాజాగా ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్ తో రూపొందించిన చిత్రమిదని అర్థమవుతుంది. 

ఇక టీజర్‌లో.. `2012 డిసెంబర్‌ 21 వాటికి డెడ్‌ లైన్‌(యుగాంతం), అసలేం జరుగుతుంది.. అంటూ `అతిపెద్ద మోసం` గురించి వెల్లడించేలా టీజర్‌ ప్రారంభమయ్యింది. కట్‌ చేస్తే బెదురులంక అనే ఒక లంక గ్రామంలోని(గోదావరి పల్లె) జీవనాన్ని చూపించారు. అక్కడ కార్తికేయ సముద్రపు బీచ్‌ ఒడ్డున కూర్చొని సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు. అజయ్‌ ఘోస్‌ కన్నింగ్‌ స్మైల్‌, కార్తికేయ హీరోయిక్‌ స్మైల్‌ చేయడం ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు, హీరో, విలన్ల ఎత్తులకు పై ఎత్తులు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తూ సాగాయి. 

ఓవైపు ఊర్లోకి వచ్చిన బాబాలు డబ్బులు వసూలు చేస్తుంటారు. మరోవైపు హీరో కార్తికేయ ఓ అందమైన అమ్మాయి నేహా శెట్టిని పడేసే పనిలో పడ్డాడు. తనకు సిగరేట్‌ అలవాటుంది. తన కోసం ఆ అలవాటు మానేయమంటుంది. దీనికి మించిన కిక్‌ ఏదైనా దొరికితే మానేస్తా అంటాడు కార్తికేయ. అందుకు ఆమె ముద్దు ఇస్తున్నట్టుగా సన్నివేశాలు మరింత రొమాంటిక్‌గా సాగాయి. అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు, ఫన్నీ ఎలిమెంట్లు, పాత్రల సంఘర్షణ, అయ్య బాబోయ్‌ బ్రహ్మాం గారు చెప్పినట్టు జరిగిపోతుందని మాట్లాడుకోవడం, చివరగా కార్తికేయ `ఆర్‌ యూ రెడీ ` అని చెప్పే ఎలిమెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఉంది. సినిమాలో ఏదో విషయం ఉందని అర్థమవుతుంది. 

2012 డిసెంబర్‌ 21న బెదురులంక  లంక గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. భూమి అంతం అవుతుందనే విషయం తెలిసి జనం ఎలా రియాక్ట్ అవుతారు, ఈ క్రమంలో పుట్టే ఫన్‌, యాక్షన్‌, కన్నింగ్‌, డ్రామా నేపథ్యంలో సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?