రవితేజ షాకింగ్ డెసిషన్.. సినిమా షూటింగ్ కి బ్రేకులు!

Published : Apr 15, 2019, 02:01 PM IST
రవితేజ షాకింగ్ డెసిషన్.. సినిమా షూటింగ్ కి బ్రేకులు!

సారాంశం

మాస్ మహారాజా రవితేజ నటించబోయే తదుపరి సినిమా షూటింగ్ ఈరోజు నుండి మొదలుకావాల్సివుంది. కానీ హీరో గారు సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది.

మాస్ మహారాజా రవితేజ నటించబోయే తదుపరి సినిమా షూటింగ్ ఈరోజు నుండి మొదలుకావాల్సివుంది. కానీ హీరో గారు సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఈవిధంగా చేయడం ఇది మూడోసారి. 'డిస్కో రాజా' సినిమాను హోల్డ్ లో పెట్టిన తరువాత 'తేరి' సినిమా రీమేక్ చేయాలనుకున్నాడు రవితేజ.

దీంతో దర్శకనిర్మాతలకు చెప్పి షూటింగ్ మొదలుపెట్టుకోమని చెప్పాడు. కాబట్టి వారు ఈరోజు నుండి షెడ్యూల్ ప్లాన్ చేశారు. తీరా షూటింగ్ సమయానికి రవితేజ హ్యాండ్  ఇచ్చేశాడని తెలుస్తోంది. సినిమా ఫైనల్ స్క్రిప్ట్ తో రవితేజ సంతృప్తి చెందలేదట.

ఆ కారణంగానే షూటింగ్ ఆపాలని నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ తన కుటుంబం తో కలిసి సమ్మర్ ట్రిప్ కి వెళ్లబోతున్నారు. నెల రోజుల తరువాత తిరిగిరానున్నారు. ఆ తరువాతే తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయానికి రానున్నాడు.

మరి సగం షూటింగ్ చేసి ఆపేసిన 'డిస్కో రాజా'ని కంప్లీట్ చేస్తాడా..? లేక 'తేరి' రీమేక్ పై దృష్టి పెడతాడా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు ప్రశాంత్ వర్మ, సుధీర్ వర్మ వంటి వారు రవితేజకి కథ చెప్పాలని తిరుగుతున్నారు. కనీసం వారితోనైనా సినిమా చేస్తారేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?