ఉపాసనపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!

Published : Apr 15, 2019, 12:34 PM ISTUpdated : Apr 15, 2019, 12:54 PM IST
ఉపాసనపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!

సారాంశం

వివాదాస్పద నటి శ్రీరెడ్డి కొంతకాలంగా మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. 

వివాదాస్పద నటి శ్రీరెడ్డి కొంతకాలంగా మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగబాబులపై విరుచుకుపడింది. ఆ విధంగా మెగాభిమానుల ఆగ్రహానికి గురైంది.

అయితే ఇప్పుడు చిరంజీవి కుటుంబంలో తనకు నచ్చిన వ్యక్తి ఒకరున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ''చిరంజీవి కుటుంబంలో నేనొకరిని ఎంతో ప్రేమిస్తాను.. మచ్చలేని మనిషి, స్ఫూర్తిప్రదాత, ఎవరో చెప్పగలరా..?'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో అందరూ మెగాఫ్యామిలీలో హీరోల పేర్లు చెప్పడం మొదలుపెట్టారు.

అయితే వారెవరూ కాదని మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాసన పేరు చెప్పింది. ఉపాసనను తనకు ఎంతో దగ్గరైన వ్యక్తిగా భావిస్తానని, గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అయితే ఆమె పెట్టిన పోస్ట్ లో ఉపాసన కొణిదెల అని రాయకుండా ఉపాసన రెడ్డి కామినేని అని రాసి మెగాఫ్యామిలీపై తనకున్న కోపాన్ని వెల్లగక్కింది. ఈ సమయంలో శ్రీరెడ్డి.. ఉపాసన టాపిక్ ఎందుకు తీసుకువచ్చిందో అర్ధం కాని పరిస్థితి.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?