
క్రాక్ మూవీతో భారీ హిట్ కొట్టిన రవితేజ(Raviteja) ఖిలాడి రిజల్ట్ తో షాక్ తిన్నాడు. మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న ఈ మాస్ హీరో లేటెస్ట్ మూవీతో వచ్చేస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. జులై 29న రామారావు చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఉత్కంఠరేపుతూ సాగింది.
రవితేజ సీరియస్ అండ్ సిన్సియర్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఆయన డిప్యూటీ కలెక్టర్ పాత్ర చేస్తున్నారు. ఓ సిన్సియర్ అధికారి కొందరు అమాయకుల కోసం చట్టం నుండి బయటికి వచ్చి ధర్మం కోసం పని చేయాలని పూనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది ప్రధాన కథ. కనపడకుండా పోయిన కొందరు కూలీల చుట్టూ మూవీ నడుస్తుందని ట్రైలర్(Ramarao Onduty Trailer) ద్వారా అర్థం అవుతుంది. ట్రైలర్ సస్పెన్సు, యాక్షన్ తో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్ కలిగి ఉంది.
పోలీస్ గెటప్ లో నటుడు వేణు తొట్టెంపూడి సరికొత్తగా ఉన్నాడు. ఈ మూవీతో ఆయన కమ్ బ్యాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. నరేష్, నాజర్, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాంషా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే రాజీషా విజయన్ మరో హీరోయిన్. చెరుకూరి సుధాకర్ నిర్మాతగా కాగా శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
మరోవైపు రవితేజ హీరోగా మరో మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాగే మెగా 154 మూవీలో రవితేజ నటిస్తున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన వచ్చింది. చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రవితేజ కీలక రోల్ చేయనున్నారు. ఆయన సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.