`ఆహా` ఓటీటీలో రవితేజ బ్లాక్‌ బస్టర్‌ `క్రాక్‌`..

Published : Feb 04, 2021, 01:48 PM IST
`ఆహా` ఓటీటీలో రవితేజ బ్లాక్‌ బస్టర్‌ `క్రాక్‌`..

సారాంశం

రవితేజ చాలా రోజులు తర్వాత సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తనకు `బలుపు` వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా, ఇటీవల `క్రాక్‌` చిత్రంలో విజయాన్ని అందుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ ఎంటర్‌టైన్‌ చేయడానికి రాబోతుంది. 

రవితేజ చాలా రోజులు తర్వాత సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తనకు `బలుపు` వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా, ఇటీవల `క్రాక్‌` చిత్రంలో విజయాన్ని అందుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా పలు అడ్డంకులు ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేసి, సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 

ఇప్పుడు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ ఎంటర్‌టైన్‌ చేయడానికి రాబోతుంది. ఈ సినిమా రేపు(ఈ నెల 5న) `ఆహా` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆహా` సీఈఓ అజిత్‌ ఠాకూర్‌ తెలిపారు. బలమైన కంటెంట్‌ని అందించే ఓటీటీ మరో బిగ్‌ సినిమాతో రాబోతుందని తెలిపారు. శుక్రవారం నుంచి బిగ్‌ సూపర్‌ హిట్‌ `క్రాక్‌` తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుందని చెప్పారు. థియేటర్‌లో భారీ కలెక్షన్లని సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటుతుందని, ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. 

`ఓ పెద్ద సినిమాతో ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలోని బిగ్‌ స్టార్స్ రవితేజ, శృతి హాసన్‌ కలిసి నటించిన చిత్రమిది. ఈ సినిమాతో మా లైబ్రరీ మరింత బలోపేతం అయ్యింది. అది టైర్‌ 2,  3 మార్కెట్‌లో తెలుగు ఆడియెన్స్ కి మరింతగా రీచ్‌ అయ్యే అవకాశం ఉంది. `ఆహా దాదాపు 24.5 మిలియన్లకు పైగా ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యింది. దాదాపు ఎనిమిది మిలియన్లు మంచి `ఆహా` యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక మన్ముందు మరింతగా విస్తరిస్తాం` అని చెప్పారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?