షాకిస్తున్న రాజ'శేఖర్' కొత్త మూవీ లుక్..!

Published : Feb 04, 2021, 11:41 AM ISTUpdated : Feb 04, 2021, 11:44 AM IST
షాకిస్తున్న రాజ'శేఖర్' కొత్త మూవీ లుక్..!

సారాంశం

రాజశేఖర్ తన 91వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. శేఖర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ ట్యాగ్ లైన్ గా ది మాన్ విత్ స్కార్... అని ఉంది. ఇక వృద్దుడిగా రాజశేఖర్ సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. రాజశేఖర్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

యాంగ్రీ హీరో రాజశేఖర్ తన బర్త్ డే నాడు కొత్త మూవీపై ప్రకటన చేశారు. రాజశేఖర్ తన 91వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. శేఖర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ ట్యాగ్ లైన్ గా ది మాన్ విత్ స్కార్... అని ఉంది. ఇక వృద్దుడిగా రాజశేఖర్ సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. రాజశేఖర్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

దర్శకుడు లలిత్ కుమార్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఎం ఎల్ వి సత్యనారాయణ, శివాత్మిక మరియు వెంకట శ్రీనివాస్ బి నిర్మిస్తున్నారు. శేఖర్ మూవీలో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి వుంది. 

రాజశేఖర్ 2019లో కల్కి మూవీ విడుదల చేయడం జరిగింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల కోవిడ్ బారిన పడిన రాజశేఖర్ విషమ పరిస్థితిని ఎదుర్కొన్నారు. రెండు వారాలకు పైగా ఆయన ఆసుపత్రిలో పోరాడి, కోలుకోవడం జరిగింది. రాజశేఖర్ తన బర్త్ డే నాడు కొత్త మూవీ ప్రకటన చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

9 గంటలు నాన్ స్టాప్ గా డబ్బింగ్, ఒక పాత్రకు 5 భాషల్లో వాయిస్ అందించిన స్టార్ హీరోయిన్ ఎవరు?
మూర్ఖులే అలాంటి పనిచేస్తారు, బాడీ షేమింగ్‌ బాధితులపై నటి రచితా రామ్ కామెంట్స్ వైరల్..