బ్లడ్ అండ్ రొమాన్స్... ఆసక్తికరంగా పవర్ ప్లే ట్రైలర్!

Published : Feb 04, 2021, 01:35 PM IST
బ్లడ్ అండ్ రొమాన్స్... ఆసక్తికరంగా పవర్ ప్లే ట్రైలర్!

సారాంశం

రాజ్ తరుణ్ ఇమేజ్ కి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్, పవర్ ప్లే చిత్రం ద్వారా ట్రై చేసినట్లు తెలుస్తుంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండా సైతం తన గత చిత్రాలకు భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నారు. నేడు పవర్ ప్లే ట్రైలర్ విడుదల కాగా... థ్రిల్లింగ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగింది.

యంగ్ హీరో రాజ్ తరుణ్ పవర్ ప్లే అంటూ ఇంటెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షుకుల ముందుకు రానున్నాడు. తన ఇమేజ్ కి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్, పవర్ ప్లే చిత్రం ద్వారా ట్రై చేసినట్లు తెలుస్తుంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండా సైతం తన గత చిత్రాలకు భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నారు. నేడు పవర్ ప్లే ట్రైలర్ విడుదల కాగా... థ్రిల్లింగ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగింది. 

రాజ్ తరుణ్ కి జంటగా హేమాల్ నటించడం జరిగింది. ఇక క్రైమ్ సన్నివేశాలతో పాటు రొమాన్స్ పాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే చిత్రంలో జోడించినట్లు తెలుస్తుంది. రాజ్ తరుణ్ లిప్ కిస్సులతో రెచ్చిపోవడం ట్రైలర్ లో చూడవచ్చు. నటుడు అజయ్ తో పాటు, హీరోయిన్ పూర్ణ పవర్ ప్లే మూవీలో కీలక రోల్స్ ప్లే చేసినట్లు అర్థం అవుతుంది. 

మొత్తంగా పవర్ ప్లే ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. మహీధర్ అండ్ దేవేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, ప్రిన్స్, టిల్లు వేణు ఇతర కీలక పాత్రల్లో నటించినట్లు సమాచారం. ఇక విజయాల పరంగా వెనుకబడ్డ రాజ్ తరుణ్ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ ఒరేయ్ బుజ్జిగా సైతం నిరాశ పరిచింది. త్వరలో పవర్ ప్లే విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?