ముగిసిన రవితేజ సిట్ విచారణ, శాంపిల్ ఇవ్వని మాస్ మహారాజ్

Published : Jul 28, 2017, 07:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ముగిసిన రవితేజ సిట్ విచారణ, శాంపిల్ ఇవ్వని మాస్ మహారాజ్

సారాంశం

డ్రగ్స్ కేసులో ముగిసిన రవితేజ సిట్ విచారణ 9 గంటల పాటు సాగిన రవితేజ విచారణ  బ్లడ్,నెయిల్,హెయిర్ శాంపిల్ ఇవ్వని మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ అలియాస్ రవి శంకర్ రాజు భూపతిరాజును ఇవాళ ఉదయం 10.30గంటల నుంచి విచారించిన సిట్ సాయంత్రం 7.30కు విచారణ ముగించింది. ముఖ్యంగా కెల్విన్, జీశాన్ లతో రవితేజకు వున్న సంబంధాలు, డ్రగ్స్ వినియోగంపై సిట్ ప్రస్నించినట్లు సమాచారం. ఇక సిట్ కోరినప్పటికీ రవితేజ బ్లడ్, హెయిర్, గోర్లు తదితర ఎలాంటి శాంపిల్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. వెళ్తూ వెళ్తూ మీడియా కెమెరాలకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు రవితేజ.

 

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డ్రగ్స్ కేసులో 12 మంది టాలీవుడ్ సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ కు సంబంధించి దర్శకుడు పూరీ జగన్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, తరుణ్, నవదీప్ లను విచారించిన సిట్ ఇవాళ హీరో రవితేజ అలియాస్ రవి శంకర్ రాజు భూపతిరాజును విచారించింది.

 

ఇప్పటికే రవితేజకు కెల్విన్ తో, జీషాన్ తో సంబంధాలున్నట్లు సిట్ అధికారుల వద్ద పక్కా సాక్షాధారాలు వున్నట్లు తెలుస్తోంది. పూరీ వర్గానికి సంబంధించిన వారిలో రవితేజ కీలకంగా వున్న హీరో అని తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి హిట్ చిత్రాలు అందించిన రవితేజకు పూరీతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న పూరీ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులు కెల్విన్, జీషాన్ లు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. రవితేజను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం.

 

రవితేజ 1999లో నీ కోసం సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాక 2002లో కూడా ఖడ్గం సినిమాకుగాను నంది అవార్డు అందుకున్నారు. 2012లో 15.5 కోట్ల వార్షికాదాయంతో ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక ఆదాయం పొందిన టాప్ సెలెబ్రిటీల్లో 50 వస్థానం దక్కించుకున్నారు. 2013లో 13 కోట్లతో 68వ స్థానం పొందారు. 2015లో 12.5కోట్లతో 74వ స్థానంలో నిలిచారు రవితేజ. తెలుగులో 50-60 చిత్రాల్లో నటించిన రవితేజ దాదాపు 40 సినిమాల్లో హీరోగా నటించి మాస్ మహారాజ్ అనే గుర్తింపు పొందారు.

 

మొత్తానికి ఇవాళ ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్న రవితేజను సిట్ అధికారులు సాయంత్రం 7.30 గంటల వరకు విచారించారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకుని వున్నా వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఊరట లభించినట్లయింది. ఇక సిట్ విచారణకు సంబంధించి రవితేజ లాయర్ తో మాట్లాడి పక్కాగా విచారణకు హాజరయ్యారని తెలుస్తోంది. కెల్విన్, జీశాన్ లు విచారణలో రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పడంతో రవితేజ విచారణ చాలా సీరియస్ గా సాగుతుందనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఎలా జరిగిందనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి