విశాల్ కు చంపేస్తామంటూ బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు

Published : Jul 28, 2017, 07:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
విశాల్ కు చంపేస్తామంటూ బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

తమిళ హీరో విశాల్ కు బెదిరింపులు నిర్మాతల మండలి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్న విశాల్ కాళ్లు చేతులు నరికేస్తాం, చంపేస్తామంటూ సీరియస్ బెదిరింపులు

కోలీవుడ్ నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, హీరో విశాల్ కు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయట. నడిగర్ సంఘంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన విశాల్ కి ఇప్పుడు చాలామందే శతృవులు తయారయ్యారు. గతం లో కూడా చంపేస్తాం అంటూ బెదిరింపులు ఎదుర్కున్నాడు. కానీ ఎప్పుడూ ఆ భయన్ని బయట పెట్టలేదు. ఎప్పుడూ తన పనేదో తను చూసుకునే రకం కాదు విశాల్ ఎప్పుడూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే విశాల్...ఈ మధ్యే కర్ణాటక వెళ్లి, అక్కడ మాట్లాడేందుకు సాహసించని కావేరీ వివాదంపై నిర్భయంగా మాట్లాడాడు.

 

సినీ నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడంటూ పలు మార్లు వార్తలు రాగా, తామిద్దరం మంచి స్నేహితులమని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్ని వివాదాల లో ఉండే విశాల్ కి ఈ మధ్యకాలంలో బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. అది కూడా మామూలుగా కాదు సీరియస్ గానే ఉంటున్నాయట. శ్రుతి మించి కాళ్లు, చేతులు నరికేస్తామంటూ బెదిరింపులు రావడంతో విశాల్ అప్రమత్తమయ్యాడు. దీంతో, నిర్మాతలు మణిమ్మరన్‌, మహమ్మద్‌ సాహిల్‌ చెన్నై సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Allu Arjun ఫోటో వాడుతున్నారా..? తేడా వస్తే ఇక జైలుకే.. ఐకాన్ స్టార్ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే?
Mrunal Thakur, Dhanush డేటింగ్, లవ్ రూమర్స్‌ లో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఏం చేయబోతున్నారో తెలుసా?