Dhamaka Movie: ఇదేం విడ్డూరం సామీ... నిర్మాతలే ధమాకాను లీక్ చేస్తున్నారుగా!

Published : Dec 23, 2022, 03:36 PM IST
Dhamaka Movie: ఇదేం విడ్డూరం సామీ... నిర్మాతలే ధమాకాను లీక్ చేస్తున్నారుగా!

సారాంశం

స్వయంగా నిర్మాతలే ధమాకా మూవీ సీన్స్ లీక్ చేయడం సంచలనంగా మారింది. ప్రమోషన్స్ పేరుతో థియేటర్ లో మొబైల్ లో చిత్రీకరించిన సాంగ్స్, ఫైట్స్ షేర్ చేస్తున్నారు.   

రవితేజ (Raviteja)లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. డిసెంబర్ 23న విడుదల చేశారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ స్టోరీ అంటున్నారు క్రిటిక్స్. అయితే అభిమానులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మా మాస్ మహారాజ్ ని ఎలా చూడాలి అనుకున్నామో.. మూవీ అలా ఉందని సంబరపడుతున్నారు. మరి కామన్ ఆడియన్స్ కి మూవీ నచ్చిందా లేదా తెలియాలంటే..వీకెండ్ ముగియాలి. 

కాగా రవితేజ ఫ్యాన్స్ థియేటర్స్ లో ధమాకా(Dhamaka) మూవీలోని సీన్స్, సాంగ్స్, ఫైట్స్ మొబైల్ లో చిత్రీకరించి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. సదరు వీడియోలకు ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. సినిమా అద్భుతం అంటూ షార్ట్ రివ్యూలు రాస్తున్నారు. నెటిజెన్స్ షేర్ చేస్తున్న ధమాకా థియేటర్ లీక్స్ ని నిర్మాతలు స్వయంగా అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో పైరసీ క్లిప్ లను ప్రోత్సహిస్తున్నారు. థియేటర్ లో మొబైల్ తో సినిమాను చిత్రీకరించవద్దు, సీన్స్, సాంగ్స్ లీక్ చేయవద్దని చెప్పాల్సిన నిర్మాతలు ఇలా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కనీసం గట్టిగా ఓపెనింగ్స్ రాబట్టొచ్చని నిర్మాతలు ఈ విధంగా  ప్రమోట్ చేస్తున్నారనిపిస్తుంది. మరోవైపు ధమాకా థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయని పిఆర్ లు ట్వీట్స్ పెడుతున్నారు. ఈ రోజుల్లో మూవీ విజయం మూడు రోజుల్లోనే తేలిపోతుంది. వీకెండ్ ముగిసే నాటికి వచ్చే కలెక్షన్స్ సినిమా ఫేట్ డిసైడ్ చేస్తాయి. అద్భుతమైన చిత్రాలు మాత్రమే రెండు మూడు వారాల రన్ కలిగి ఉంటాయి. 

మరి ధమాకా ఫలితం ఏమిటో ఆదివారానికి తెలిసిపోతుంది. 25 క్రిస్మస్ నేపథ్యంలో ధమాకా చిత్రానికి కలిసి రావచ్చు. గత ఏడాది డిసెంబర్ టాలీవుడ్ కి బాగా కలిసొచ్చింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి మూడు సూపర్ హిట్ చిత్రాలు డిసెంబర్ లో విడుదలయ్యాయి. మరి 2022 డిసెంబర్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. ధమాకా చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?