అందాలతో ఆల్మోస్ట్ పడగొట్టేసిన నివేతా పేతురాజ్.. విశ్వక్ సేన్ 'ధమ్కీ' నుంచి వీడియో సాంగ్

By team telugu  |  First Published Dec 23, 2022, 2:27 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం 'ధమ్కీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్ సేన్ ప్లాన్. ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది.


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం 'ధమ్కీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్ సేన్ ప్లాన్. ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ట్రైలర్ లాంచ్ కి నందమూరి బాలకృష్ణ హాజరు కావడంతో పెద్ద హంగామానే జరిగింది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దీనితో విశ్వక్ సేన్ నెమ్మదిగా ప్రమోషన్స్ జోరు పెంచుతున్నాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ కి జోడిగా హాట్ బ్యూటీ నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. 

Latest Videos

ఇప్పటికే ఈ జంట పాగల్ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చూస్తుంటే ధమ్కీ చిత్రంలో రొమాన్స్ ఘాటు పెంచినట్లు అర్థం అవుతోంది. ఇటీవల విడుదలైన 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే లిరికల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 

ఈ సాంగ్ లో విశ్వక్ సేన్ డ్యాన్స్, నివేత పేతురాజ్ గ్లామర్ మంటలు రేపే విధంగా ఉన్నాయి. నివేతా పేతురాజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పొట్టి బట్టల్లో, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఈ సాంగ్ లో నివేతా కుర్రాళ్ళని ఆకర్షించే విధంగా ఉంది. 

బీచ్ లో అందాలు ఆరబోస్తూ ఆమె చేస్తున్న డ్యాన్స్ యువతకి విజువల్ ఫీస్ట్ అనుకోవచ్చు. ఆల్రెడీ యూత్ లోకి ఈ సాంగ్ బాగా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేసి క్రేజ్ పెంచుతున్నారు. 

 

click me!