ఆస్కార్ రేసులో కాంతార సినిమా, సెలక్ట్ అవుతుందా..?

By Mahesh JujjuriFirst Published Dec 23, 2022, 1:32 PM IST
Highlights

ప్రస్తతం పాన్ ఇండియ సినిమాల హవా నడుస్తుంది సౌత్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ కు వెళ్తున్నాయి. ఈక్రమంలోనే ఆస్కార్ రేసులో కూడా సత్తా చాటాలనిచూస్తున్నాయి. రీసెంట్ గా ఆస్కార్ కోసం కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ప్రస్తతం పాన్ ఇండియ సినిమాల హవా నడుస్తుంది సౌత్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ కు వెళ్తున్నాయి. ఈక్రమంలోనే ఆస్కార్ రేసులో కూడా సత్తా చాటాలనిచూస్తున్నాయి. రీసెంట్ గా ఆస్కార్ కోసం కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన సినిమా కాంతార. ఈ మూవీ కన్నడ నాట మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా రేంజ్ లో ఎంతగా సక్సెస్ సాధించిందో తెలిసిందే. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. ఓవర్ ఆల్ గా 400 కోట్ల వరకూ కనెక్షన్లు సాధించింది. కాంతారా కాన్సెప్ట్ జనాలకు గట్టిగా ఎక్కేసింది. ఇక ఈమూవీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళే ప్రయత్నం చేస్తున్నారు మూవీ టీమ్. 

కన్నడ నాట కెజియఫ్ తరువాత ఆరేంజ్ లో హిట్ అయిన సినిమా ఇదే. అయితే కెజియఫ్ టీమ్ కుకూడా రాని ఆలోచిన కాంతార మూవీమేకర్స్ కు వచ్చింది  ఈ సినిమా ఆస్కార్ రేసులో పోటీపడబోతోందని  తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంతార  నిర్మాత స్వయంగా వెల్లడించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.  ఆస్కార్ కోసం అప్లికేషన్ పంపామని నిర్మాత విజయ్ పేర్కొన్నారు. 

95వ ఆస్కార్ నామినేషన్స్ కు సంబంధించిన వివరాలను 2023 సంవత్సరం జనవరి నెల 24న  ప్రకటించనుండగా ఆ జాబితాలో కాంతార కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంతార ఇండియాలో చాలా గౌరవాలు అందుకుంది. అన్ని భాషల్లో ఈమూవీని బాగా ఆదరించారు. తెలుగు ఇప్పటికే గీతా ఆర్ట్స్ నుంచి స్వయంగా సినిమా అవకాశం ఇచ్చారు అల్లు అరవింద్. ఇక ఈక్రమంలో కాంతార మూవీ ఆస్కార్ రేసులో నిలిస్తే మాత్రం కాంతార సినిమాతో పాటు రిషబ్ రేంజ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతే కాదు రిషబ్ శెట్టి కష్టానికి తగిన ఫలితం కూడా దక్కినట్టు అవుతుంది. 

ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో బాగా పాపులర్ అయ్యాడు రిషబ్. కాంతార సినిమాకు 4 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన.. ప్రస్తతం  50 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిషబ్ కి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినట్టు సమాచారం. అందులో బెస్ట్ ఆప్షన్ తీసుకుని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు కన్నడ స్టార్ హీరో . 

click me!