Raviteja: గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' గా రవితేజ ... పాన్ ఇండియా రిలీజ్!

Published : Nov 03, 2021, 01:08 PM IST
Raviteja: గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' గా రవితేజ ... పాన్ ఇండియా రిలీజ్!

సారాంశం

ఓ కమర్షియల్ చిత్రానికి కావలసిన హీరోయిజం, డ్రామా, ఎమోషన్స్ ఆయన రియల్ లైఫ్ లో ఉన్నాయి. ఏళ్ల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు జీవితం వెండితెరపైకి వస్తే రికార్డులే అని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని స్టువర్ట్ పురం గ్రామానికి చెందిన Tiger nageswararao జీవిత కథ తెరపైకి తేవాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.చాకచక్యంగా దొంగతనాలు చేసి, మెరుపు వేగంతో పారిపోగల దిట్టగా ఆయనకు పేరుంది. ఇక పెద్దలను దోచి పేదలకు పెట్టే తత్త్వం కూడా ఆయనదని తెలియడంతో, ఇండియన్ రాబిన్ హుడ్ గా టైగర్ నాగేశ్వరరావు పేరు పొందారు. 

ఓ కమర్షియల్ చిత్రానికి కావలసిన హీరోయిజం, డ్రామా, ఎమోషన్స్ ఆయన రియల్ లైఫ్ లో ఉన్నాయి. ఏళ్ల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు జీవితం వెండితెరపైకి వస్తే రికార్డులే అని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు పాత్ర చేస్తున్నారంటూ Pawan kalyan, రానా, సాయి శ్రీనివాస్, నాని ఇలా చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. చివరికు ఈ క్రేజీ ప్రాజెక్ట్ హీరో రవితేజ ఖాతాలోకి వచ్చి చేరింది. దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

Also read పెద్దన్న’ వెనక పెద్దలున్నా... ఎవరూ పట్టించుకోరేంటి?
నేడు దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మరో విశేషం ఏమిటంటే పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా తెరకెక్కుతుండగా ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. పంచెకట్టులో చెప్పులు లేని కాళ్లను పులి అడుగుజాడలను వదులుతుండగా, దూరంగా రైల్ కనిపిస్తుంది. మొత్తంగా ప్రకటనతోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, మిగతా నటుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read Lala bheemla lyrical:తగ్గేదేలే... ఆర్ ఆర్ ఆర్ కి ఎదురే... క్లారిటీ ఇచ్చిన భీమ్లా నాయక్
మరోవైపు క్రాక్ తో భారీ హిట్ కొట్టిన Raviteja వరుసగా చిత్రాలు ప్రకటిస్తున్నారు. ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడి చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. అలాగే రామారావు టైటిల్ తో ఓ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. దీనికి శరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన తో ధమాకా, సుధీర్ వర్మ దర్శకత్వంలో తన 70వ చిత్రం ప్రకటించారు. తాజాగా నేడు టైగర్ నాగేశ్వరరావు మూవీపై అధికారిక ప్రకటన చేశారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే