‘పెద్దన్న’ వెనక పెద్దలున్నా... ఎవరూ పట్టించుకోరేంటి?

By Surya PrakashFirst Published Nov 3, 2021, 12:43 PM IST
Highlights

తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ తో తెలుగులో రేపు అనగా 4 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు. ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యిపోతుంది. కానీ ఈ సారి అలా జరగలేదు. 

రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో అన్నాత్తే' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, 'అన్నా చెల్లెళ్ల' సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ తో తెలుగులో రేపు అనగా 4 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా రజనీ సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు. ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యిపోతుంది. కానీ ఈ సారి అలా జరగలేదు. ఇప్పటిదాకా ఈ సినిమా పై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అందుకు కారణం తెలుగులో చెప్పుకోదగ్గ ప్రమోషనల్ ఈవెంట్స్ జరపకపోవటం ఓ కారణంగా ట్రేడ్ చెప్తోంది. అలాగే సరైన ట్రైలర్ పడకపోవటం కూడా మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, మరో నిర్మాత దిల్‌రాజు, నారాయణ్‌దాస్‌ నారంగ్‌తో కలిసి రిలీజ్ చేస్తున్నారు.
  
‘‘కరోనా తర్వాత సినీ పరిశ్రమ పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్‌కి రావడం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో మరో వాణిజ్య ప్రధానమైన పెద్ద సినిమా అయితే మరింత మంది ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించడం సులభం అవుతుంది. అందుకే మేం కలిసి ‘పెద్దన్న’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. 
 
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘తమిళంలో తెరకెక్కిన ‘అన్నాత్తే’ సినిమాకి అనువాదంగా వస్తోంది ‘పెద్దన్న’. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమాని విడుదల చేస్తున్నాం. మేం కలిసి ఈ సినిమాని ఎందుకు విడుదల చేస్తున్నామా అనే అనుమానాలు రావొచ్చు. ఇకపై కూడా మేం కలిసి సినిమాలు నిర్మిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ‘పెద్దన్న’లాంటి పెద్ద సినిమాలు అవసరం. మంచి కథ, మంచి పాటలు, మంచి వాణిజ్యాంశాలున్న చిత్రమిది. ఒకప్పటి రజనీకాంత్‌ కనిపిస్తున్నారు. భావోద్వేగాలు, అన్నాచెల్లెళ్ల బంధం, క్లాస్‌ మాస్‌ కలిసి చూడగలిగే అంశాలున్న సినిమా. అందుకే మేం కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. 

Also read Lala bheemla lyrical:తగ్గేదేలే... ఆర్ ఆర్ ఆర్ కి ఎదురే... క్లారిటీ ఇచ్చిన భీమ్లా నాయక్

అలాగే ‘‘ప్రేక్షకులు భిన్న రకాల సినిమాలు చూడాలనుకుంటున్నారు. వాళ్లకి రకరకాల కథలు అందించేందుకు ఎగ్జిబిటర్లు కూడా కలిసిపోయి సినిమాల్ని పంచుకుంటున్నారు. ఇదివరకు కొన్ని సినిమాల్నే ఉత్తరాదిలో విడుదల చేసేవాళ్లం. ఇప్పుడు మన సినిమాలు అక్కడ విరివిగా విడుదలవుతున్నాయి. అది ప్రేక్షకులకు మంచిది, పరిశ్రమకీ మంచిది’’ అన్నారు.

Also read Suma kanakala: వెండితెర రీఎంట్రీకి సిద్దమైన యాంకర్ సుమ.. మైండ్ బ్లోయింగ్ డిటైల్స్
 

click me!