రవితేజ జోరు మామూలుగా లేదుగా.. మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌..

Published : Feb 21, 2021, 07:22 PM IST
రవితేజ జోరు మామూలుగా లేదుగా.. మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌..

సారాంశం

ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `క్రాక్‌` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. దీంతో పూర్వ వైభవాన్ని పొందాడు. ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. దీంతో వరుసగా సినిమాలను ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

త్రినాథరావు నక్కినతో రవితేజ సినిమా చేయబోతున్నట్టు గతంలోనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై రవితేజగానీ, దర్శకుడు త్రినాథరావు నక్కిన గానీ స్పందించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి తన ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తూ రవితేజ ఈ సినిమాని ప్రకటించాడు. తన 68వ చిత్రంగా ఇది రూపొందనుంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుందని, దీన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌, వివేక్‌ కూచిభోట్ల నిర్మించనున్నారు.  కుమార్‌ బెజవాడ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. త్రినాథరావు నక్కిన గతంలో `సినిమా చూపిస్త మావ`, `నేనులోకల్‌`, `హలో గురు ప్రేమకోసమే` చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద