ప్రభాస్‌ `ఆదిపురుష్‌` లుక్‌ ఇదేనా?.. వైరల్‌ అవుతున్న నయా ఫోటో

Published : Feb 21, 2021, 05:39 PM IST
ప్రభాస్‌ `ఆదిపురుష్‌` లుక్‌ ఇదేనా?.. వైరల్‌ అవుతున్న నయా ఫోటో

సారాంశం

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. `రాధేశ్యామ్‌` షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరోవైపు `సలార్‌` షూటింగ్‌లో, దీంతోపాటు `ఆదిపురుష్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ న్యూ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. `రాధేశ్యామ్‌` షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరోవైపు `సలార్‌` షూటింగ్‌లో, దీంతోపాటు `ఆదిపురుష్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ న్యూ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయన ఇటీవల ముంబయిలో ఓ అభిమానితో ఫోటో దిగారు. అంతేకాదు అతని `ఆదిపురుష్‌` లుక్‌ అంటూ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌ లుక్‌ ఇదేనంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` సినిమా రూపొందుతుంది. రామాయణం ప్రధానంగా సాగే చిత్రమిది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఆ మధ్య సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఓపెనింగ్‌ రోజే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కొన్నాళ్లపాటు షూటింగ్‌ వాయిదా వేశారు. మళ్లీ ఇటీవల ప్రారంభించారని, ఆ సినిమా షూటింగ్‌ కోసం ముంబయి వెళ్లిన ప్రభాస్‌ షూటింగ్‌ సమయంలో ఫ్యాన్‌తో ఫోటో దిగినట్టు తెలుస్తుంది.  ఇందులో ప్రభాస్‌ కళ్లజోడు, తలకు క్యాప్‌ పెట్టుకుని పొడుగు మీసాలతో కనిపిస్తున్నాడు. ఆయన లుక్‌ నిజంగానే పవర్‌ ఫుల్‌గా ఉంది. 

ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తుంది. సీతగా కృతి సనన్‌ పేరు వినిపిస్తుంది. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపొందుతుంది. మరోవైపు ప్రభాస్‌ `సలార్‌` సైతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇది రామగుండంలోని బొగ్గుగనుల్లో ఇటీవల షూటింగ్‌ జరిపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30న విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద