`శ్యామ్‌ సింగరాయ్‌` ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేసిన నాని

Published : Feb 21, 2021, 05:02 PM IST
`శ్యామ్‌ సింగరాయ్‌` ఫస్ట్  లుక్‌ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేసిన నాని

సారాంశం

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం `శ్యామ్‌ సింగరాయ్‌`. `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల తేదీని ఖరారు చేశారు. 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం `శ్యామ్‌ సింగరాయ్‌`. `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల తేదీని ఖరారు చేశారు. నాని పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు కావడంతో `శ్యామ్‌ సింగరాయ్‌` ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నామని నాని ట్విట్టర్‌ ద్వారా  వెల్లడించారు.ఈ సందర్భంగా చిన్న వీడియో క్లిప్‌ని పంచుకున్నారు. ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్‌ అని టైప్‌ చేస్తున్నట్టుగా  ఉంది. ఈ సినిమా  మొదటి నుంచి ప్రత్యేకతని చాటుకుంటున్నారు. టైపింగ్‌ మెథడ్‌లో వివరాలను వెల్లడిస్తున్నారు. 

`టాక్సీవాలా`వంటి  ఓ డిఫరెంట్‌ చిత్రాన్ని డీల్‌ చేసి దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ ప్రశంసలందుకున్నారు. ఈ సినిమా లీక్‌ అయినా, ఆ తర్వాత థియేటర్‌లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక నాని ప్రస్తుతం `శ్యామ్‌సింగరాయ్‌`తోపాటు `టక్‌జగదీష్‌`, `అంటే సుందరానికి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా