ఎన్టీఆర్ కోసమే చేశానంటున్న తమన్నా

Published : Sep 15, 2017, 03:02 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఎన్టీఆర్ కోసమే చేశానంటున్న తమన్నా

సారాంశం

‘జై లవ కుశ’లో ఐటెమ్ సాంగ్ చేసిన తమన్నా గతంలోనూ రెండు చిత్రాల్లో ఐటెం సాంగ్ చేసిన తమన్నా తమన్నా లుక్ ని విడుదల చేసిన చిత్ర బృందం

ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘జై లవ కుశ’. అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతగా ఎదురు చూశారో.. ఆ సినిమాలోని  ఐటెం సాంగ్ కోసం కోసం కూడా అంతే ఎదురు చూశారు. ఎందుకుంటే అందులో ఆడిపాడింది తమన్నా కాబట్టి.  తమన్నా.. ఐటెం సాంగ్ చేయడం ఇది మొదటి సారేం కాదు.. ఇప్పటికే బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన ‘ అల్లుడు శ్రీను’, ‘ స్పీడున్నోడు’ చిత్రాల్లో చేసింది.

 

అయితే.. ఈ సినిమాలో మాత్రం కేవలం ఎన్టీఆర్ కోసమే చేశానని తమన్నా చెప్పింది. ఇక అసలు విషయానికి వస్తే.. ‘జై లవ కుశ’ లోని అన్ని పాటలు విడుదల చేసినప్పటికీ.. తమన్నా డ్యాన్స్ చేసిన ‘స్వింగ్ జరా’ ఐటెం సాంగ్ ని మాత్రం విడుదల చేయలేదు. ఈరోజు సాయంత్రం ఆ పాట విడుదల చేస్తుండగా.. ఆ పాటలోని తమన్నా లుక్ ని చిత్ర బృందం ఉదయం విడుదల చేసింది.

 

పాట సంగతి ఎలా ఉన్నా.. తమన్నా లుక్ మాత్రం అదిరిపోయిందంటున్నారు సినీ జనాలు. గోల్డ్ రంగు డ్రస్ లో చాలా స్టైలిష్ గానూ, అందంగానూ కనిపిస్తున్న తమన్నా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అందరితోపాటు తాను కూడా ఈ సినిమా చూడటానికి చాలా ఆత్రంగా ఉన్నట్లు తమన్నా ట్వీట్ చేసింది.

 

ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించగా వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

Gundeninda Gudigantalu: తాగొచ్చిన బాలుకి చుక్కలు చూపించిన మీనా..కోపాలు తగ్గించుకుని ఎలా ఒక్కటయ్యారంటే
కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?