‘సచ్చిందిరా గొర్రె’ అంటున్న అనసూయ

Published : Sep 15, 2017, 02:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
‘సచ్చిందిరా గొర్రె’ అంటున్న అనసూయ

సారాంశం

వరుస సినిమా ఛాన్స్ కొట్టేస్తున్న హాట్ యాంకర్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం దక్కించుకున్న అనసూయ అనసూయ లీడ్ రోల్ లో ‘ సచ్చిందిరా గొర్రె’

ప్రముఖ టీవీ హాట్ యాంకర్ అనసూయకి సినిమా అవకాశాలు వరస కడుతున్నాయి.  సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున  మరదలిగా, క్షణంలో పోలీస్ ఆఫీసర్ గా, విన్నర్ లో ఓ చిన్న పాత్రలో మెరిపించిన అనసూయకు ఇటీవలే రాంచరణ్ రంగస్థలం మూవీలో కూడా ఓ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే..  ఇప్పుడు ఆమెకు మరో సినిమా ఛాన్స్ వచ్చింది. కాకపోతే.. ఈ చిత్రంలో అన్ని సినిమాల్లో లాగా  కాసేపు కనిపించి పోయే పాత్ర కాదు..  పూర్తి స్థాయిలో లీడర్ రోల్ లో మెప్పించనుంది.

 

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘ సచ్చిందిరా గొర్రె’ అనే పేరును ఖరారు చేశారు. కథ కథనం చాలా కొత్తగా ఉంటుందని.. తన పాత్రలో చాలా రకాల షేడ్స్ ఉంటాయని.. తొలిసారి కామెడీ చేస్తున్నట్లు చెప్పింది అనసూయ. ప్రముఖ కమెడియన్లు.. శ్రీనివాస్ రెడ్డి, టిల్లు వేణు, జబర్థస్త్ రాకేష్, శకలక శంకర్, శివారెడ్డి, రవిబాబు, తాగుబోతు రమేష్, మంగ్లీ, చిత్రం శ్రీను, కోటా శంకర్ రావు లాంటి వాళ్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర లు పోషిస్తున్నారు.

 

వైవిధ్య కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చెబుతోంది చిత్ర బృందం. శ్రీధర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..సోహమ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా,  దీపక్ ముకుత్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్