
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. వంశి అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలయింది. టీజర్ లో ప్రతి ప్రేము గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. రవితేజ డార్క్ యాక్షన్.. దానికి తోడు మురళి శర్మ ఇస్తున్న ఎలివేషన్స్ అదిరిపోయాయి.
చెన్నై సెంట్రల్ జైలు నుంచి టైగర్ నాగేశ్వరరావు తప్పించుకున్నాడు అనే న్యూస్ తో టీజర్ మొదలవుతుంది. ఇంతలో అనుపమ్ ఖేర్ పాత్ర కూడా పరిచయం అవుతుంది. మురళి శర్మ ఎంట్రీ ఇచ్చి.. సర్.. నాగేశ్వర రావు పాలిటిక్స్ లోకి వెళ్లి ఉంటే అతగాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు.. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే తన పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు.. ఆర్మీలోకి వెళ్లి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు.. కానీ దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు సర్ అంటూ మురళి శర్మ ఇస్తున్న ఎలివేషన్స్.. చూపిస్తున్న యాక్షన్ షార్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి.
నూతన దర్శకుడు అయినప్పటికీ వంశీ టేకింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. పులి సింహం కూడా ఒక వయసొచ్చేవరకు పాలే తాగుతాయ్.. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగాడు అంటూ మురళి శర్మ చెప్పే మరో డైలాగ్ రవితేజ పాత్ర ఎంత క్రూరంగా పవర్ ఫుల్ గా ఉండబోతోందో తెలియజేస్తోంది. ఇంతలో రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. ఇక చివర్లో బ్రిడ్జి పై వెళుతున్న ట్రైన్ కి రవితేజ వేలాడుతూ వెళ్లే షాట్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా టైగర్ నాగేశ్వర రావు టీజర్ అదిరిపోయింది. ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి అని చెప్పడం లో సందేహం లేదు. జివి ప్రకాష్ కుమార్ ఇస్తున్న బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. టీజర్ మొత్తం 80 దశకం తగ్గట్లుగా డార్క్ థీమ్ లో సాగుతోంది.